Home » Hyderabad News
గణేశ్ నిమజ్జనాల సందర్భంగా ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద 40 క్రేన్లు ఏర్పాటు చేసినట్లు నగర సీపీ ఆనంద్ తెలిపారు. గణేశ్ ఉత్సవాలకు సంబంధించి సీపీ మీడియాకు వివరాలు వెల్లడించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏళ్లుగా టీచర్ల నియామకం చేపట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత పదేళ్లుగా టీచర్ల బదిలీలు జరగలేదని తెలిపారు. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాలని ఆలోచన చేస్తు్న్నట్లు చెప్పారు.
అసెంబ్లీలో కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీరాజ్ యాక్ట్ 285Aను సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
పోర్టుల నుండి ఆదిలాబాద్, జడ్చర్ల, గద్వాల, వరంగల్, మిర్యాలగూడ, పందిళ్లపల్లి, సనత్ నగర్, గజ్వెల్ ప్రాంతాలకు యూరియా చేరుకోనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పుకొచ్చారు. అక్కడి నుంచి డిమాండ్ పరంగా జిల్లాలకు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.
జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో జియాగూడ 100 ఫీట్ రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆ రోడ్డును అధికారులు మూసివేశారు. జియాగూడ - పురానాపూల్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 37 ఆర్ అండ్ బీ డివిజన్ల నుండి సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా ఇప్పటి వరకు 794 సమస్యాత్మక రోడ్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. మొత్తం 1039 కి.మీ రోడ్లు దెబ్బతిన్నాయని నివేదిక వచ్చినట్లు చెప్పారు.
నటుడు లోబో.. టాటూ ఆర్టిస్టుగా కెరియర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత యాంకర్ గా తన ప్రయాణాన్ని మార్చుకున్నారు. డ్రెస్సింగ్, మేకప్‌కి ప్రసిద్ధి చెందిన లోబో అనేక టెలివిజన్ షోలలో కనిపించి, యాంకర్‌గా సత్తా చాటారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రియాలిటీ షోలో కూడా లోబో పాల్గొన్న విషయం తెలిసిందే.
ఆర్థిక కష్టాలతో ఉన్నా నిందితుడికి కుందేలు నిర్వహణకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి..? కుందేలుకు అనారోగ్యంగా ఉందని హడావిడి చేసిన నిందితుడు.. కుందేలును ఏ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు..? చనిపోయిన తర్వాత ఎక్కడ పాతిపెట్టాడనే ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు రాబట్టే పనిలో పడ్డారు.
హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానాకి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఖైరతాబాద్ గణేశ్ 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలు మొదటి రోజు కావడంతో గణేశ్ వద్ద భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. పోలీసులు చర్యలు చేపడుతున్నారు.