Home » Hyderabad City Police
పెద్దమ్మగుడి కూల్చివేతపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ నమోదైంది. అక్రమంగా కూల్చిన ఆలయాన్ని తక్షణమే నిర్మించాలని పల్లె వినోద్ కుమార్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
ఇప్పుడు HCA ఖాతాలో కేవలం 40 కోట్లు మాత్రమే ఉందని సీఐడీ పేర్కొంది. 20 నెలలో 200 కోట్లు ఖర్చు చేసినట్లు గుర్తించినట్లు చెప్పుకొచ్చింది. దేని కోసం ఖర్చు చేశారో.. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా బయటపడనుందని స్పష్టం చేసింది.
సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సిట్‌కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఈ కేసుకు సంబంధించిన విషయాలను నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ మీడియాకు వెల్లడించారు.
హైదరాబాద్ నగరంలో పోలీసులు గురువారం తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు ఓ వ్యక్తి తీసుకువచ్చారు. ఆ డ్రగ్స్‌ను శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాల్లో కడపకు చెందిన గుత్తా తేజ కృష్ణకు విక్రయిస్తుండగా చాకచక్యంగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.
డాక్టర్ నమ్రతను కస్టడీకి ఇవ్వడం ద్వారా ఇంకా అనేకమైన విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఆమె నుంచి 86 మంది సరోగసీ దంపతుల వివరాలు సేకరించాలని తెలిపారు.
బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో ఈడీ విచారణకు టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ బుధవారం హాజరయ్యారు. ఈ కేసులో విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సృష్టి ఫెర్టిలిటీ డాక్టర్ నమ్రత కస్టడీకి సంబంధించి పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు.
రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాల్నాడు రెస్టారెంట్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు పెంచింది.
వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో హార్స్ రేసింగ్‌పై బెట్టింగ్‌లను ఆహ్వానిస్తున్న ఓ బుకీతోపాటు ముగ్గురు పంటర్లను మల్కాజిగిరి ఎస్‌ఓటీ, జవహర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2లక్షల నగదు, మొబైల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
చోరీ జరగడం ఒకటైతే.. పోయిన సొత్తు విషయంలో క్లారిటీ లేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. చోరీ అయిన బంగారం 26 తులాలు అని బాధితులు పేర్కొంటుండగా, కాదు కాదు తాము తస్కరించింది కేవలం 5 తులాలే అంటూ నిందితులు పేర్కొంటుండడం ఇందుకు కారణమైంది.