Hyderabad Husband Kills Wife: హైదరాబాద్‌లో దారుణం.. భార్య గొంతు కోసి భర్త పరార్..
ABN , Publish Date - Sep 20 , 2025 | 09:47 AM
హైదరాబాద్, కుషాయిగూడ పరిధిలోని రాధిక థియేటర్ సమీపంలో భార్య గొంతు కోసి హత్య చేశాడు ఓ భర్త. భార్య బంధువుల ఇంట్లో ఉన్న సమయంలో హత్య చేసి.. భర్త పరారయ్యాడు.
హైదరాబాద్: మానవత్వం మరిచి మనిషి మృగంలా మారి దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు తరుచూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆలోచన ధోరణిని మరిచి క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలకు బలి అవుతున్నారు. కొందరు అయితే జాలి, దయ అనే వాటిని మరిచి, పాశవికంగా వ్యవహరిస్తున్నారు. క్షణికావేశంలో చేసిన తప్పులకు జైలుపాలు అవుతున్నారు. ఎందుకు చేస్తున్నామో.. దేనికోసం చేస్తున్నామో కూడా తెలియకుండా ఆవేశంలో ప్రాణాలను హరిస్తున్నారు. ఇలాంటి ఓ ఘటనే నగరంలో వెలుగు చూసింది. ఓ భర్త మృగంలా మారి భార్యను అతికిరాతకంగా హత్య చేశాడు.
హైదరాబాద్, కుషాయిగూడ పరిధిలోని రాధిక థియేటర్ సమీపంలో భార్య గొంతును కత్తితో కోసి హత్య చేశాడు ఓ భర్త. భార్య బంధువుల ఇంట్లో ఉన్న సమయంలో హత్య చేసి.. భర్త పరారయ్యాడు. స్థానికులు సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలిని మహారాష్ట్ర ముంబై చెందినదిగా గుర్తించారు. నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి స్థానికులను వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.