Home » Himachal Pradesh
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం(Himachal pradesh crisis) మరింత ముదిరింది. కాంగ్రెస్ తిరుగుబాటుదారులతో సహా 11 మంది ఎమ్మెల్యేలు శనివారం బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌కు చేరుకున్నారు.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈరోజు భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో చివరి మ్యాచ్ ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆటలో ఇంగ్లండ్ 218 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ పదవీ నుంచి హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సుధీర్ శర్మను తొలగించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలతో శర్మను పదవీ నుంచి తొలగించామని జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటనలో తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లో గల ధర్మశాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుధీర్ శర్మ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో మంత్రిగా కూడా విధులు నిర్వహించారు.
హిమాచల్ ప్రదేశ్‌లో అనర్హతకు గురయిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమపై స్పీకర్ కుల్దీప్ సింగ్ అనర్హత వేటు వేయడం అక్రమం, రాజ్యాంగ విరుద్ధం అని ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేసిన సంగతి తెలిసిందే.
తూర్పు, ఈశాన్య భారతదేశంలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు మార్చి 5 నుంచి మార్చి 7 వరకు ఉంటాయని వెల్లడించింది. అయితే ఏ రాష్ట్రాల్లో వర్షాలు ఉంటాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ హిమపాతం, వర్షాల కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. నాలుగు జాతీయ రహదారులతో సహా 350 రహదారులను అధికారులు మూసివేశారు. దీంతోపాటు అన్ని విద్యాసంస్థలను మూసివేశారు.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలో నెలకొన్న అసమ్మతి ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు సభ్యులు క్రాస్ ఓటింగ్ చేయడంతో మొదలైన రగడ, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినప్పటికీ.. మంత్రి విక్రమాదిత్య సింగ్ కాంగ్రెస్ పార్టీకి పక్కలో బల్లెంలా మారారు.
హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ రేపుతోన్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించి బీజేపీకి ఓటేసిన ఆరుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ కుల్దీప్ సింగ్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆ ఎమ్మెల్యేలతో మంత్రి విక్రమాదిత్య చర్చలు జరుపుతున్నారని తెలిసింది.
రాజ్యసభ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకున్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.
రాజ్యసభ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్ హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభానికి దారితీసింది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనతో ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు గురువారం నాడు ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు.