Share News

Viral Video: కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. ఏమైందో తెలుసా?

ABN , Publish Date - Mar 21 , 2024 | 09:29 AM

ఇటివల కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రెండ్ ఎక్కువైంది. పెళ్లి చేసుకోబోయే ప్రతి జంట దాదాపు అనేక ప్రాంతాల్లో ప్రీ వెడ్డింగ్ షూట్‌ల పేరుతో ఫోటోలు, వీడియోలు చిత్రీకరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టెలివిజన్ నటి ఆర్య వోరా(Aarya Voraa) ప్రీ వెడ్డింగ్ షూట్(pre wedding shoot) తన ప్రాణాలమీదకు వచ్చిందని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Viral Video: కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. ఏమైందో తెలుసా?

ఇటివల కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రెండ్ ఎక్కువైంది. పెళ్లి చేసుకోబోయే ప్రతి జంట దాదాపు అనేక ప్రాంతాల్లో ప్రీ వెడ్డింగ్ షూట్‌ల పేరుతో ఫోటోలు, వీడియోలు చిత్రీకరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టెలివిజన్ నటి ఆర్య వోరా(Aarya Voraa) ప్రీ వెడ్డింగ్ షూట్(pre wedding shoot) తన ప్రాణాలమీదకు వచ్చిందని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే ఆమె ప్రీ వెడ్డింగ్ షూట్‌ని హిమాచల్ ప్రదేశ్‌(himachal pradesh)లోని స్పితి వ్యాలీ(Spiti Valley)లో మైనస్ 22 డిగ్రీల టెంపరేచర్ ఉన్న ప్రాంతంలో చిత్రీకరించారు.

ఆ క్రమంలోనే విపరీతమైన చలి కారణంగా తాను స్పృహ తప్పి పడిపోయినట్లు ఇన్‌స్టాగ్రామ్‌(instagram) వేదికగా వీడియో పోస్ట్ చేసి పేర్కొన్నారు. అల్పోష్ణస్థితి కారణంగా తాను చనిపోతానని అనుకున్నట్లు తెలిపారు. ఆ నేపథ్యంలో ఆమెను పలువురు పట్టుకుని ఉపశమనం కలిగే విధంగా చేశారు. వీడియోలో ఆర్య వోరా స్ట్రాప్‌లెస్ బ్లాక్ గౌను ధరించి నడుచుకుంటూ వస్తుంది. అయితే ఇది చూసిన చాలా మంది నెటిజన్లు(netizens) ఆర్య వోరా చేసిన పనిని పిచ్చిగా అభివర్ణిస్తున్నారు. ఫోటోలు ఎంత ముఖ్యమైనవిగా మారాయో చూడటం చాలా బాధగా ఉందని మరో వ్యక్తి పేర్కొన్నాడు. షూట్ కోసం ఎవరైనా తమ ప్రాణాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారా అని ఇంకో వ్యక్తి వ్యాఖ్యానించారు.


ఆర్య వోరా(Aarya Voraa) 2007లో వచ్చిన 'మై ఫ్రెండ్ గణేష్' సినిమాతో తెరంగేట్రం చేసింది. దీని తర్వాత 2013లో 'దేవోన్ కే దేవ్ మహాదేవ్'లో గణేశుడి భార్య సిద్ధి పాత్రలో నటించింది. ఇలా ఆర్య వోరాకు మంచి పాపులారిటీ వచ్చింది. ఆర్య భరతనాట్యం నర్తకి కూడా. ఆర్య వోరా టెలివిజన్, సినిమాల ప్రపంచానికి దూరమైన తర్వాత ఇప్పుడు ఈ విధంగా వార్తల్లో నిలిచారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: IPL 2024: గుజరాత్ నుంచి కీలక అప్‌డేట్.. షమీ స్థానంలో జట్టులోకి ఆ యువ బౌలర్

Updated Date - Mar 21 , 2024 | 09:31 AM