Share News

Himachal Crisis: హిమాచల్ సంక్షోభం.. 11 మంది ఎమ్మెల్యేలు జంప్, నెక్ట్స్ ఏంటి?

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:21 PM

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం(Himachal pradesh crisis) మరింత ముదిరింది. కాంగ్రెస్ తిరుగుబాటుదారులతో సహా 11 మంది ఎమ్మెల్యేలు శనివారం బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌కు చేరుకున్నారు.

Himachal Crisis: హిమాచల్ సంక్షోభం.. 11 మంది ఎమ్మెల్యేలు జంప్, నెక్ట్స్ ఏంటి?

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం(Himachal pradesh crisis) మరింత ముదిరింది. ఈ క్రమంలోనే రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు మద్దతుగా నిలిచి సస్పెన్షన్‌కు గురైన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సహా మొత్తం 11 మంది ఉత్తరాఖండ్ చేరుకున్నారు. వీరంతా శనివారం బీజేపీ(BJP) పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌(uttarakhand) రిషికేశ్(rishikesh) సమీపంలోని ఓ హోటల్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొన్ని రోజుల్లో వీరితో మరికొంత మంది నాయకులు వచ్చి చేరవచ్చని తెలుస్తోంది. ఈ విధంగా చూస్తే మరికొన్ని రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ సీఎం మార్పు ఖాయమని అనిపిస్తోంది.

అయితే బడ్జెట్‌పై ఓటింగ్‌కు దూరంగా ఉన్న ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(congress mlas) రాజిందర్ రాణా, సుధీర్ శర్మ, ఇందర్ దత్ లఖన్‌పాల్, దేవీందర్ కుమార్ భుత్తు, రవి ఠాకూర్, చెతన్య శర్మలను హిమాచల్ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా బహిష్కరించారు. వీరంతా రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. మరోవైపు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు హోషియార్ సింగ్, కెఎల్ ఠాకూర్, ఆశిష్ శర్మ కూడా ఫిబ్రవరి 27 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ తెలిపారు.


మరోవైపు బీజేపీ ఇక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ(Sukhvinder Singh Sukhu) అన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని సుఖ్వీందర్ సింగ్ సుఖూ శుక్రవారం ఆరోపించారు. కాంగ్రెస్‌(congress) రెబల్‌ ఎమ్మెల్యేలను సీఆర్‌పీఎఫ్‌(CRPF) రక్షణలో ఉంచుకుంటున్నారని అన్నారు.

ఆ క్రమంలో కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను కట్టుదిట్టమైన భద్రతలో ఉంచడం ద్వారా వారు విచారంగా ఉన్నారని సుఖూ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలా ఎప్పుడైనా చుశారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలతో వ్యాపారం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు వారిని సొంత రాష్ట్రానికి తిరిగి రావాలని వారి కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారని సుఖ్వీందర్ సింగ్ సుఖూ తెలిపారు.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Narendra Modi: మళ్లీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ మోదీ..ఈ గ్రామాలను పట్టించుకోలేదని వ్యాఖ్య

Updated Date - Mar 09 , 2024 | 01:22 PM