Share News

Congress: కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ పోస్ట్ నుంచి హిమాచల్ ప్రదేశ్ నేత తొలగింపు

ABN , Publish Date - Mar 06 , 2024 | 02:58 PM

కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ పదవీ నుంచి హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సుధీర్ శర్మను తొలగించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలతో శర్మను పదవీ నుంచి తొలగించామని జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటనలో తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లో గల ధర్మశాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుధీర్ శర్మ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో మంత్రిగా కూడా విధులు నిర్వహించారు.

Congress: కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ పోస్ట్ నుంచి హిమాచల్ ప్రదేశ్ నేత తొలగింపు

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ (Congress) సెక్రటరీ పదవీ నుంచి హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సుధీర్ శర్మను (Sudhir Sharma) తొలగించారు. కాంగ్రెస్ పార్టీ (Congress) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలతో శర్మను పదవీ నుంచి తొలగించామని జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుధీర్ శర్మ (Sudhir Sharma) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో మంత్రిగా కూడా విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేసిన ఎమ్మెల్యేల్లో సుధీర్ శర్మ (Sudhir Sharma) కూడా ఉన్నారు. అందుకోసం అతనిని సెక్రటరీ పదవీ నుంచి తొలగించారు. సెక్రటరీ పదవీ నుంచి తొలగించిన తర్వాత సుధీర్ శర్మ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. ఇప్పటివరకు భారం మొత్తం భుజాలపై ఉండేది.. ఇప్పుడు ఆ భారం దిగిపోయిందని సెటైర్లు వేశారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హిమాచల్ ప్రదేశ్‌లో క్రాస్ ఓటింగ్ వేయడంతో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి హర్ష మహాజన్ గెలుపొందారు. కాంగ్రెస్ సభ్యుల ఫిర్యాదుతో హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ ఆరుగురు సభ్యులపై అనర్హత వేటు వేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 06 , 2024 | 02:58 PM