Home » Heavy Rains
తుఫాన్ తీవ్రత నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ సెలవులు ప్రకటించారు.
వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నేడు, రేపు శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై హోం మంత్రి దిశానిర్దేశం చేశారు.
అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు.
ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రభావం ఏర్పడిందని.. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు.
తమిళనాడు రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది.
ఉత్తర బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజుల పాటు ఏపీకి వర్ష సూచన ఉందని తెలిపారు.
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, నదులు ఉప్పొంగడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేస్తున్నాయి.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.