Share News

Rains: 8 వరకు మోస్తరు వర్షాలు..

ABN , Publish Date - Nov 04 , 2025 | 10:59 AM

రాష్ట్రంలో ఈ నెల 8వ తేది వరకు ఒకటి, రెండు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశముందని చెన్నై వాతావారణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.

Rains: 8 వరకు మోస్తరు వర్షాలు..

చెన్నై: రాష్ట్రంలో ఈ నెల 8వ తేది వరకు ఒకటి, రెండు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశముందని చెన్నై(Chennai) వాతావారణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... మధ్య తూర్పు బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతం మియన్మార్‌ వద్ద సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా పయనించి మియన్మార్‌, బంగ్లాదేశ్‌ మధ్య తీరం దాటుతుందన్నారు. అదే సమయంలో తూర్పు దిశ గాలుల వేగంలో మార్పు చోటుచేసుకుంది.


nani1.2.jpg

ఈ ప్రభావంతో, మంగళవారం నుంచి ఈ నెల 8వ తేది వరకు రాష్ట్రంలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. చెన్నై, శివారు ప్రాంతాల్లో రాబోయే 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఓటర్ల సమస్యకు సత్వర పరిష్కారం

అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 04 , 2025 | 10:59 AM