Share News

Chennai News: అల్ప పీడనం ఎఫెక్ట్.. చేపలవేటపై నిషేధం

ABN , Publish Date - Nov 18 , 2025 | 10:27 AM

బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడటంతో సముద్ర తీర ప్రాంతాల్లో పెనుగాలులు వీస్తుండటంతో తూత్తుకుడి, నాగపట్టినం, కారైక్కాల్‌ ప్రాంతాల మత్స్యకారులు చేపలవేటకు వెళ్ళకుండా మత్స్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

Chennai News: అల్ప పీడనం ఎఫెక్ట్.. చేపలవేటపై నిషేధం

చెన్నై: బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడటంతో సముద్ర తీర ప్రాంతాల్లో పెనుగాలులు వీస్తుండటంతో తూత్తుకుడి, నాగపట్టినం, కారైక్కాల్‌(Thoothukudi, Nagapattinam, Karaikal) ప్రాంతాల మత్స్యకారులు చేపలవేటకు వెళ్ళకుండా మత్స్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. గత మూడు రోజులుగా చేపల వేటపై ఆంక్షలు కొనసాగుతుండటంతో ఆ ప్రాంతాల జాలర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


nani1.jpg

వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో చేపలవేటపై నిషేధం అమలు చేస్తున్నట్లు అధికారులు వారికి వివరణ ఇచ్చారు. ఇదే విధంగా రామేశ్వరం, పాంబన్‌(Rameshwaram, Pamban) జిల్లాల్లోనూ మరపడవల జాలర్లు సోమవారం చేపలవేటకు వెళ్లలేదు.


zzz.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి దిగుమతులు మూడింతలు

తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్‌ కార్లకు భలే డిమాండ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Nov 18 , 2025 | 10:27 AM