Home » Heavy Rains
వరుసగా మూడ్రోజులపాటు మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదనీరు చేరుతోంది. శుక్రవారం 404.70 అడుగులకు నీటి మట్టం పెరిగింది. మహబూబాబాద్ జిల్లాలోని పాకాల కొత్తగూడం నుంచి గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, కొత్తగూడెం అటవీ ప్రాంతాల నుంచి జలాశయానికి 1,700 క్యూసెక్కుల చొప్పున నీరు చేరడంతో డ్యాం అధికారులు అప్రమత్తమయ్యారు.
నగరంలో శుక్రవారం రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై వరద ప్రవాహం కనిపించింది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రదేశాల్లో ఇబ్బందులు తలెత్తాయి.
ష్ట్రంలో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు రెండు రోజులకు పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో అలెర్ట్‌లను జారీ చేసింది.
బిజాపూర్‌లోని వర్షప్రభావిత ప్రాంతంలో బాధితుల కోసం సహాయ సామగ్రితో హెలికాప్టర్ వెళ్తుండగా మొహమాండ్ జిల్లా పాండియాలి వద్ద కుప్పకూలిందని గందాపుర్ తెలిపారు. వాతావరణ ప్రతికూలత కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు.
జమ్మూకశ్మీరులో మేఘవిస్ఫోటం (క్లౌడ్ బర్‌స్ట)తో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. కిష్ట్వార్ జిల్లాలోని మారుమూల గ్రామం చోసితిలో గురువారం హఠాత్తుగా మేఘవిస్ఫోటం జరగడంతో మెరుపు వరదలు వచ్చాయి.
నగరంలో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హరిచందన దాసరి అధికారులకు సూచించారు. వర్షం తీవ్రత అధికంగా ఉంటే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని పేర్కొన్నారు.
చినుకు వణికిస్తోంది.. వరద దడ పుట్టిస్తోంది. కొన్నాళ్లుగా రాష్ట్రంపై దట్టంగా కమ్ముకొని వదలని మేఘం ఉరుములు, మెరుపులతో మరోసారి భీకరంగా గర్జించింది.
విజయవాడ నగరంలో కురిసిన భారీ వర్షానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొత్తపేటలో ఇద్దరు మృతి చెందారు..
కుండపోత వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వానలు దంచికొడుతున్నాయి. ..