Home » Hardik Pandya
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమై పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఎంఐ నుంచి ఇలాంటి ఆటతీరును ఫ్యాన్స్ ఆశించిఉండరు.
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు ఈ సీజన్ లీగ్ దశలో నిలకడైన ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో కూడా ఓడిపోవడంతో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పరిమితమైంది
ఐపీఎల్ 2026 నుంచి ముంబై ఇండియన్స్ ముందుగానే నిష్క్రమించడంతో హార్దిక్ పాండ్య కెప్టెన్సీపై విమర్శలు వ్యక్తమయ్యాయి. వచ్చే సీజన్‌లో ఈ ఆల్‌రౌండర్ జట్టుకు నాయకత్వం వహించకూడదని కొంతమంది క్రీడా నిపుణులు, అభిమానులు సూచిస్తున్నారు.
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఘోర ప్రదర్శనపై ఆ జట్టు కోచ్ కీరన్ పొలార్డ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు అన్ని అవకాశాలిచ్చామని, కానీ అతడు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడన్నాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్య మైదానంలోనే తీవ్ర స్థాయిలో ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాండ్య ఎందుకు అలా ప్రవర్తించాడనే విషయంపై ఎంఐ కోచ్ మహేలా జయవర్ధనె స్పందించాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య వరుస మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అభిమానుల్లో నెలకొన్న అనుమానాలపై ముంబై ఇండియన్స్ క్లారిటీ ఇచ్చింది. గురువారం పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించిన అనంతరం స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఈ విషయంపై మాట్లాడాడు.
ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. వరుస ఓటములతో ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో హార్దిక్ పాండ్య ఇన్ స్టా స్టోరీ తీవ్ర చర్చనీయాంశం అయింది.
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. అయితే ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్య లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. కాగా బెంగళూరుతో జరిగే కీలక పోరుకు పాండ్య బరిలోకి దిగే అవకాశం ఉంది.
రాయ్‌పుర్ వేదికగా మే 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎంఐ తలపడనుంది. అందులో భాగంగా రాయ్‌పుర్ వెళ్లేందుకు ముంబై ఆటగాళ్లు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. కానీ అందులో హార్దిక్ పాండ్య కనిపించలేదు. దీంతో హార్దిక్ కెప్టెన్సీపై వేటు పడిందా? అనే చర్చ మొదలైంది.
ఐపీఎల్ 2026లో వరుస ఓటములతో ముంబై ఇండియన్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో కేవలం రెండింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్లు సెహ్వాగ్, మురళీ కార్తిక్ స్పందించారు.