Home » Guntur
ఓ వృద్ధురాలి ఆకాంక్షను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. తనను కలిసి ఫొటో దిగాలన్న ఆ వృద్ధురాలి కోరికను ఆయన తీర్చారు. అలాగే ఇదే సమయంలో ఇచ్చిన మాట ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ చేనేత కుటుంబాన్ని ఆయన కలిశారు.
చేనేత కుటుంబాలతో కలిసి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘నేతన్న సేవలో’ పథకానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందజేస్తున్నామని.. మొత్తం 71,636 చేనేత కుటుంబాలకు పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు అయ్యింది. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై అంబటి అసత్య ప్రచారం చేశారంటూ జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు చేశారు.
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) అథారిటీ 64వ సమావేశం ఈరోజు (మంగళవారం) నిర్వహించినట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సమావేశంలో రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి సీఆర్డీఏ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో రూ.100 కోట్లతో కేంద్ర యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ (CRIYN) ఏర్పాటు కానుంది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ బృందం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి ఆమోదం తెలిపిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
వైస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమ రంగం కుదేలైనట్లు పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పాల ఉత్పత్తి తగ్గడం, తలసరి పాల లభ్యత క్షీణించడం వంటి అంశాలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని వివరించింది.
గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ముస్తఫా ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. గుజరాత్‌లో ముస్తఫాను నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు అటవీ డివిజన్, రాచర్ల బీట్‌లో ఉన్న గుండ్లకమ్మ అటవీ ప్రాంతంలో పెద్దపులి మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పల్నాడు జిల్లా అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక సాధికారతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో ఆయనను ఎంపీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ‘క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్’ ప్రగతిపై సమగ్ర నివేదికను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆ శాఖ అధికారులతో సోమవారం మధ్యాహ్నం సమీక్షా సమావేశం నిర్వహించారు. 'నేతన్న సేవలో' పథకం అమలు, కార్యాచరణపై అధికారులతో చర్చించి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు మంత్రి సవిత కీలక సూచనలు చేశారు.