ఏపీలో త్వరలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్..
ABN , Publish Date - Jul 01 , 2026 | 05:25 PM
ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవాదుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన 'యువగళం' హామీని నెరవేర్చే దిశగా మంత్రి నారా లోకేశ్ కసరత్తు ప్రారంభించారు.
అమరావతి: రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేకంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో 'యువగళం' హామీ అమలు దిశగా మంత్రి నారా లోకేశ్ చర్యలు చేపట్టారు.
న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని న్యాయవాదుల ప్రతినిధులు మంత్రి లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చట్టం రూపకల్పన, అమలు విధానంపై మంత్రి ఫరూక్‌తో లోకేశ్ చర్చించినట్లు సమాచారం.
Also Read:
వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలకు దూరంగా ఉండండి
ట్రెక్కింగ్.. ఆయాసం వస్తే ఏం చేయాలి?