తాడేపల్లి ప్యాలెస్ నుంచి నెల నెలా ఎంత ముడుతోంది: మంత్రి దుర్గేష్
ABN , Publish Date - Jul 04 , 2026 | 05:14 PM
నటుడు ప్రకాష్‌రాజ్ చేసిన ట్వీట్‌పై మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రకాష్‌రాజ్, జోసెఫ్ రావణ్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలపై ప్రకాష్‌రాజ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
అమరావతి: నటుడు ప్రకాష్‌రాజ్ చేసిన ట్వీట్‌పై మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించేలా కొందరు వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రకాష్‌రాజ్‌తో పాటు జోసెఫ్ రావణ్‌పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన మంత్రి దుర్గేష్.. ప్రకాష్‌రాజ్, జోసెఫ్ రావణ్ సంఘవిద్రోహ శక్తులుగా మారారని విమర్శించారు. ప్రకాష్‌రాజ్‌కు జోసెఫ్ రావణ్‌తో ఏమైనా సంబంధం ఉందా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలపై ప్రకాష్‌రాజ్ ఎందుకు స్పందించలేదని మంత్రి ప్రశ్నించారు. వైసీపీ పాలనలో జరిగిన అకృత్యాలు, హిందూ ఆలయాలపై దాడుల సమయంలో ఆయన ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. అంతేకాకుండా, తాడేపల్లి ప్యాలెస్ నుంచి మీకు ప్రతి నెలా ఎంత డబ్బు అందుతోందని ప్రకాష్‌రాజ్‌ను ఉద్దేశించి మంత్రి దుర్గేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించి విధ్వంసకర వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి దుర్గేష్ వ్యాఖ్యానించారు.
Also Read:
తిరుపతిలో చిరుత కలకలం.. ఇంట్లోకి చొరబడేందుకు యత్నం.. వీడియో వైరల్
ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు.. ప్రధాన పోర్టులకు IMD హెచ్చరిక..