Share News

తిరుపతిలో చిరుత కలకలం.. ఇంట్లోకి చొరబడేందుకు యత్నం.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 04 , 2026 | 04:07 PM

తిరుపతి సమీపంలోని జనావాసాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరుతపులి.. ఏకంగా ఓ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. అదే సమయానికి ఆ ఇంటి కుటుంబ సభ్యులు మేల్కొని గట్టిగా కేకలు వేయడంతో చిరుత అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..

తిరుపతిలో చిరుత కలకలం.. ఇంట్లోకి చొరబడేందుకు యత్నం.. వీడియో వైరల్
Leopard in Tirupati

తిరుపతి, జులై 4: ఇటీవల కాలంలో ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిరుత పులుల సంచారం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా.. రేణిగుంట మండలం వెంకటాపురం గ్రామంలో అర్ధరాత్రి వేళ ఓ చిరుతపులి జనావాసాల్లోకి రావడం స్థానికంగా కలకలం రేపింది. ఆహారం, నీటి అన్వేషణలో భాగంగా అడవి నుంచి బయటకు వచ్చిన ఆ చిరుత.. గ్రామంలోని ఓ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. చిరుతను గమనించిన ఇంటి కుటుంబ సభ్యులు.. గట్టిగా కేకలు వేయడం ప్రారంభించారు. దీంతో చిరుతపులి అక్కడి నుంచి పారిపోయింది. ఎట్టకేలకు చిరుత వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


ఇదిలా ఉంటే.. చిరుతపులి సంచారానికి సంబంధించిన దృశ్యాలన్నీ ఆ ఇంటి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అర్ధరాత్రి వేళ చిరుత పిల్లిలా నక్కినక్కి రావడం, ఇంట్లోకి దూరాలని చూడటం ఆ ఫుటేజీలో కనిపించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకుని పరిశీలించారు. ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగవద్దని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చిరుతను పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.


ఇవి కూడా చదవండి..

బంగారం ధరలు పెరుగుతున్నాయ్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

భర్త కనబడడం లేదని ఫిర్యాదు చేసింది.. చివరకు ఇంటి బాత్రూమ్ కింద తవ్వి చూడగా..

Updated Date - Jul 04 , 2026 | 04:55 PM