Share News

పల్నాడు జిల్లా మాచర్ల వద్ద ఘోర ప్రమాదం.. కారు, లారీ ఢీకొని నలుగురి మృతి..

ABN , Publish Date - Jun 26 , 2026 | 06:41 AM

పల్నాడు జిల్లా మాచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరవనం వద్ద లారీ, తుఫాను వాహనం ఢీకొని నలుగురు మృతిచెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.

పల్నాడు జిల్లా మాచర్ల వద్ద ఘోర ప్రమాదం.. కారు, లారీ ఢీకొని నలుగురి మృతి..
Road Accident in Palnadu

పల్నాడు జిల్లా: మాచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరవనం వద్ద లారీ, తుఫాను వాహనం ఢీకొని నలుగురు మృతిచెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. వేగంగా వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో సంఘటనా స్థలంలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, ఇతర వాహనదారుల వెంటనే 108, పోలీసులకు సమాచారం అందించారు.


హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను వెంటనే మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బాధితులను హైదరాబాద్ వాసులుగా పల్నాడు జిల్లా పోలీసులు గుర్తించారు. వెంటనే వారి కుటుంబాలకు సమాచారం అందించారు. కాగా, బాధితులు హైదరాబాద్ నుంచి పామురు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి

కాపు వ్యక్తి చనిపోతే పవన్‌పైకి ఎందుకు వెళ్తారు?: సంధ్యారాణి

కేంద్రం ఆప్షన్లు పరిశీలించాక మన అభిప్రాయం చెబుదాం అప్పటిదాకా దీనిపై మాట్లాడొద్దు: సీఎం

Updated Date - Jun 26 , 2026 | 07:18 AM