కాపు వ్యక్తి చనిపోతే పవన్‌పైకి ఎందుకు వెళ్తారు?: సంధ్యారాణి
ABN , Publish Date - Jun 26 , 2026 | 06:37 AM
‘కాపు కులానికి చెందిన వ్యక్తి ఒకరు మరణిస్తే వైసీపీ నాయకులు ఉప ముఖ్యమంత్రి మీదకు ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదు.
సాలూరు, జూన్ 25(ఆంధ్రజ్యోతి): ‘కాపు కులానికి చెందిన వ్యక్తి ఒకరు మరణిస్తే వైసీపీ నాయకులు ఉప ముఖ్యమంత్రి మీదకు ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదు. మహిళల అంగసౌష్ఠవం గురించి సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడడం దారుణం’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ‘కూటమి ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే మూడు పార్టీల నాయకులూ కచ్చితంగా కౌంటర్ ఇవ్వాలి. తల్లిని, చెల్లిని బయటకుతోసి చిన్నాన్నను చంపిన పార్టీ వారికి మహిళల గురించి ఏం తెలుస్తుంది?’ అని మంత్రి ప్రశ్నించారు.