Home » Gujarat
ప్రధాని మోదీ గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కుటుంబాన్ని పరామర్శించారు. విమాన ప్రమాదంలో చనిపోయిన వాళ్లలో రూపానీ కూడా ఉన్నారు. తీవ్ర ఆవేదన వెలిబుచ్చిన మోదీ.. రూపానీతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
విమానం కూలిపోయిన భయానక క్షణాలను తలుచుకుని భారత సంతతికి చెందిన 40 ఏళ్ల బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ చిగురుటాకులా వణికిపోయారు. ప్రస్తుతం ఆసుపత్రులో ఆయన చికిత్స పొందుతున్నారు.
Ahmedabad Flight Accident: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి 1206 నెంబర్ అంటే పిచ్చి. ఆ నెంబర్‌ను తన లక్కీ నెంబర్‌గా భావించేవారు. ఆ నెంబర్‌తో సంబంధం ఉన్న రోజే ముఖ్యమైన కార్యక్రమాలు మొదలుపెట్టేవారు.
Ahmedabad Flight Accident: గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మొత్తం 241 మంది చనిపోయినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. విమానంలో ఉన్న అందరూ చనిపోగా.. ఒకడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.
PM Modi: అహ్మదాబాద్ సమీపంలో విమాన ప్రమాద ఘటన స్థలాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం పరిశీలించారు. అనంతరం సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అలాగే ధ్వంసమైన మెడికల్ కాలేజ్ భవనాన్ని కూడా పరిశీలించారు.
బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్.. అత్యాధునికమైన, ఇంధన సామర్థ్యం కలిగిన విమానంగా పేరుపొందింది. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ తయారు చేసిన ఈ భారీ విమానంలో ఒకేసారి 242-290 మంది వరకు ప్రయాణించవచ్చు.
Boeing Aircraft: అహ్మదాబాద్‌లో విమానం కూలిపోయిన ఘటనతో బోయింగ్ సంస్థ విమానాల పనితీరుపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.
అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానంలో ఆ రాష్ట్ర మాజీ సీఎం విజయ్ రూపానీ (68) కన్నుమూశారు. ఆయన గుజరాత్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
విమానంలో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు పైలట్.. సంబంధిత ‘ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్’ (ఏటీసీ)కి మేడే కాల్ చేస్తారు. అవతలి వారికి స్పష్టంగా వినిపించటం కోసం ‘మేడే, మేడే, మేడే’ అంటూ మూడుసార్లు చెబుతారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు టాటా గ్రూపు రూ.కోటి చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. గాయపడినవారికి ఉచిత వైద్య సహాయం అందిస్తామని తెలిపింది.