Share News

Air India Plane Crash: మంటల్లో విమానం.. నడుచుకుంటూ బయటకొచ్చిన మృత్యుంజయుడు

ABN , Publish Date - Jun 16 , 2025 | 06:56 PM

ఘటనా స్థలి నుంచి రమేష్ బయటకు వస్తుండగా ఆ వెనుక విమానం కాలిపోతున్న దృశ్యాలు పెద్దఎత్తున పొగ చుట్టుపక్కల వ్యాప్తించడం కనిపిస్తోంది. ప్రమాదంలో గాయపడిన అతనిని చూసి కొందరు అతన్ని అక్కడి నుంచి తరలించడం వీడియోలో చోటుచేసుకుంది.

Air India Plane Crash: మంటల్లో విమానం.. నడుచుకుంటూ బయటకొచ్చిన మృత్యుంజయుడు

అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లో ఈనెల 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది అక్కడికక్కడే మరణించగా... భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ అనే ఒకే ఒక్కడు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. కూలిన విమాన శిథిలాల నుంచి నడుచుకుంటూ వచ్చి ఆ తర్వాత స్పృహతప్పిన రమేష్ ప్రాణాల నుంచి బయటపడ్డారు. తాజాగా ఆయనకు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. ప్రమాద స్థలి నుంచి ఆయన నడుచుకుంటూ వస్తున్న దృశ్యం ఈ వీడియోలో కనిపిస్తోంది.

ఘటనా స్థలి నుంచి రమేష్ బయటకు వస్తుండగా ఆ వెనుక విమానం కాలిపోతున్న దృశ్యాలు పెద్దఎత్తున పొగ చుట్టుపక్కల వ్యాప్తించడం కనిపిస్తోంది. ప్రమాదంలో గాయపడిన అతనిని చూసి కొందరు అతన్ని అక్కడి నుంచి తరలించడం వీడియోలో చోటుచేసుకుంది.

దీనికి ముందు, రమేష్ రక్తంతో తడిసిన చొక్కాతో శిథిలాల నుంచి బయటకు వస్తున్న వీడియో సైతం బయటకు వచ్చింది. ప్రమాదానికి గురైన విమానంలోని 11-ఏ సీటులో ఆయన కుర్చోవడం, విమానంలో మంటలు చెలరేగడంతో సీటు విరిగి కిందపడటంతో మంటలు తనను అంటుకోలేదని రమేష్ తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరామర్శించిన క్షతగాత్రుల్లో రమేష్ కూడా ఉన్నారు.

భోజనం నాణ్యతపై స్పైస్‌జెట్ పాసింజర్లు అగ్రహం.. సిబ్బందితో తినిపించిన వైనం

రాజా రఘువంశీ హత్యకు కొన్ని గంటల ముందు వీడియో.. షాకింగ్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 16 , 2025 | 07:03 PM