Home » Gottipati Ravi Kumar
అన్నదాత సుఖీభవ మొదటి దశ నిధులను ఈనెల 20వ తేదీన విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. 45.5 లక్షల మంది రైతులకు కేంద్ర సాయంతో కలిపి రూ.12వేలు జమ చేస్తామని స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారి కోసం ఒక తట్ట మట్టి కూడా వేయలేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. వెలిగొండ లాంటి ప్రాజెక్టు అభివృద్ధిని కూడా అడ్డుకున్నారంటూ ఆ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళల పట్ల జగన్‌కు, గొడ్డలి పార్టీ నేతలకు ఉన్న గౌరవం ఏపాటిదో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే అని అన్నారు.
గొడ్డలి ప్రభుత్వం విధ్వంసం చేసిన విద్యుత్ వ్యవస్థను చంద్రబాబు నాయకత్వంలో రెండేళ్లలో గాడిన పెట్టామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. జగన్ అమలు చేసిన ట్రూ అప్ విధానాన్ని ట్రూ డౌన్ చేసి చరిత్ర సృష్టించామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల నిర్మాణాలను నిర్ణీత కాల వ్యవధి లోపు పూర్తి చేయాలని ఉన్నతాధికారులను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు. బుధవారం అమరావతిలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో ఎక్కడ కరెంట్ సమస్య తలెత్తినా పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులతో పలుచోట్ల విద్యుత్ అంతరాయం తలెత్తుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు.
అమరావతిలో వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరా తీశారు. క్షేత్రస్థాయి అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, విద్యుత్ పునరుద్ధరణ పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.
ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఇంధన పొదుపు మీద ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఖర్చులు తగ్గించుకోవాలని, పగటిపూట మన ఇంటిపైనే సౌరశక్తి ద్వారా విద్యుత్‌ను తయారుచేసుకుని వినియోగించుకోవాలని సీఎం చెప్పారన్నారు.
వేసవిలో ఎంత డిమాండ్ ఉన్నా విద్యుత్ కోతలు ఉండటానికి వీల్లేదని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు స్పష్టం చేశారు. అకాల వర్షాలు, అధిక వేడి వల్ల తాత్కాలిక కరెంట్ సమస్యలు తలెత్తిన్నా వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు.
‘లాభాల్లోని విద్యుత్ శాఖను వైసీపీ ప్రభుత్వ హయాంలో విధ్వంసం చేశారు. తొమ్మిదిసార్లు విద్యుత్ చార్జీలను పెంచి.. ప్రజలతో కట్టించిన వైసీపీకి విద్యుత్ కొనుగోళ్లపై మాట్లాడే నైతిక హక్కు లేదు’ అని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు.