అనితను రాజకీయంగా ఎదుర్కోలేకే వ్యక్తిత్వ హననానికి దిగజారారు: గొట్టిపాటి రవికుమార్
ABN , Publish Date - Jun 17 , 2026 | 03:02 PM
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళల పట్ల జగన్‌కు, గొడ్డలి పార్టీ నేతలకు ఉన్న గౌరవం ఏపాటిదో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే అని అన్నారు.
అమరావతి, జూన్ 17: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మహిళల పట్ల జగన్‌కు, గొడ్డలి పార్టీ నేతలకు ఉన్న గౌరవం ఏపాటిదో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే అని అన్నారు. హోం మంత్రి అనితను రాజకీయంగా ఎదుర్కోలేకే వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని విమర్శించారు. గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆ నేతల బూతులు ప్రజలు వినలేకపోయారని అన్నారు. గత రెండేళ్ల నుంచి రాష్ట్రంలో బూతుల గోల లేదని, ప్రజలు ప్రశాంతంగా ఉంటే ఉనికి చాటుకునేందుకు గొడ్డలి పార్టీ నేతలు యత్నిస్తున్నారని మండిపడ్డారు.
మహిళల్ని కించపరిచేలా ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు. ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మారడం లేదని, ఇంగితం లేకుండా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. మహిళలపై ద్వేషంతోనే వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మహిళల పట్ల చులకనగా మాట్లాడే నేతలకు ఈ సమాజంలో స్థానం లేదని గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
మహిళలంటే జగన్‌కు మొదటి నుంచీ ద్వేషం: సానా సతీశ్
కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ డీఎన్ఏ అని రాజ్యసభ సభ్యులు సానా సతీశ్ వ్యాఖ్యానించారు. తన రాజకీయ పబ్బం కోసం జగన్ కాపులను బలిపశువుల్ని చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. అన్నివర్గాల ప్రజలు.. జగన్ కుట్రలను తిరస్కరించి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసినా మళ్లీ కులాల మధ్య చిచ్చుకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. జగన్ కుల చిచ్చులో భాగంగానే గుడివాడ అమర్‌నాథ్ దిగజారేలా హోం మంత్రి అనితపై విమర్శలు చేశారన్నారు. మహిళలంటే జగన్‌కు మొదటి నుంచీ ద్వేషమని.. కన్న తల్లి, సొంత చెల్లిని గెంటేయటమే ఇందుకు నిదర్శనమన్నారు. గుడివాడ అమర్‌నాథ్ బేషరతుగా హోంమంత్రి అనితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మహిళల పట్ల వైసీపీ నేతల చిన్నచూపుకు ఇది నిదర్శనమమని సతీశ్ అన్నారు. అహంకారంతో మహిళలను అవమానిస్తే సహించబోమన్నారు. మహిళల పట్ల గొడ్డలి పార్టీ వైఖరి ఇలాగే ఉంటే 2029లో ఆ 11 సీట్లు కూడా రావన్నారు. కష్టపడి స్వశక్తితో ఉన్నత స్థానానికి చేరుకున్న అనిత పట్ల ఇటువంటి వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. మహిళల పట్ల చులకనగా మాట్లాడే నేతలకు ఈ సమాజంలో స్థానం లేదని సానా సతీశ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి...
రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి అనిత
‘మీ ఇంటి వద్దే ఉన్నా.. డీఎస్సీపై చర్చకు సిద్ధం’.. జగన్‌కు లోకేశ్ సవాల్
Read Latest AP News And Telugu News