Share News

‘మీ ఇంటి వద్దే ఉన్నా.. డీఎస్సీపై చర్చకు సిద్ధం’.. జగన్‌కు లోకేశ్ సవాల్

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:25 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. జగన్ ఇంటికి 200మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నానని.. డీఎస్సీపై అనుమానాలుంటే సమాధానం చెప్పేందుకు ఇక్కడే సిద్ధంగా ఉన్నట్లు లోకేశ్ తెలిపారు.

‘మీ ఇంటి వద్దే ఉన్నా.. డీఎస్సీపై చర్చకు సిద్ధం’.. జగన్‌కు లోకేశ్ సవాల్
Minister Nara Lokesh

గుంటూరు జిల్లా, జూన్ 17: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. డీఎస్సీపై తాడేపల్లి ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో ఉండి మరీ ఛాలెంజ్ చేశారు మంత్రి. ‘జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నా.. డీఎస్సీపై అనుమానాలుంటే సమాధానం చెప్పేందుకు ఇక్కడే సిద్ధంగా ఉన్నా. సవాల్ స్వీకరించే ధైర్యం ఉన్నవాళ్లు చర్చకు రావాలి. జగన్ ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీ నియామకాలు ఆపలేరు. మేం సాక్షి క్యాలెండర్ కాకుండా నిజమైన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాం. ఒక్క డీఎస్సీ అయినా నిర్వహించి ఉంటే హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లు అర్థమవుతాయి’ అంటూ వ్యాఖ్యానించారు. పులివెందుల ఎమ్మెల్యే.. బెంగళూరు, హైదరాబాద్ వీడి ఏపీ వైపు చూస్తే అభివృద్ధి కనిపిస్తుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.


ప్రిజనరీ చుట్టూ ఎప్పుడూ రౌడీలే ఉంటారని మంత్రి అన్నారు. మహిళల్ని కించపరిచే వారిని, తిట్టేవారిని తన చుట్టూ ప్రిజనరీ పెట్టుకుంటారంటూ దుయ్యబట్టారు. కోడిగుడ్డుకు పరిశ్రమకు తేడా తెలియని వాళ్లు మంత్రులుగా చేయబట్టే పరిశ్రమలు పారిపోయాయంటూ మండిపడ్డారు. గుడివాడ అమర్‌నాథ్ అద్భుతంగా మాట్లాడారని జగన్ కితాబివ్వటం దురదృష్టకరమన్నారు. భారతీరెడ్డి, తన ఇద్దరు కూతుళ్లని.. హోం మంత్రిని అవమానించినట్లు అవమానిస్తే కూడా జగన్ శభాశ్ అంటారా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీది ఆ సంస్కృతి కాదు కాబట్టే జగన్ కుటుంబసభ్యుల్ని కించపరిచిన వారిపైనా చర్యలు తీసుకున్నామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

దుర్గమ్మ సన్నిధిలో అక్షరాభ్యాస మహోత్సవం.. తరలివచ్చిన చిన్నారులు, తల్లిదండ్రులు

రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 17 , 2026 | 01:50 PM