Home » Godavari
పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన శ్రీరాం సాగర్ నుంచి దిగువన భద్రాచలం వరకు భారీగా ప్రవాహం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం మెల్లగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేస్తోంది.
ఎగువన కురిసిన భారీ వర్షాలు, వస్తున్న వరదతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గురువారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 51.9 అడుగులు ఉండగా వరద ప్రవాహం 13.66 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 3.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేయడంతో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు తగ్గుముఖం పడుతూ వచ్చిన గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది.
మూడు రోజులుగా గోదావరి పరివాహకంలో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. గురువారం అర్ధరాత్రి 12 గంటలకు 20.8అడుగులున్న నీటిమట్టం శుక్రవారం ఉదయం 6 గంటలకు 23.6 అడుగులకు చేరింది.
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం డ్యాం కళకళలాడుతోంది.
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తుతోంది.
గోదావరి నీటిమట్టం అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు
తెలుగు రాష్ట్రాల జలవివాదాలపై చర్చించేందుకుగాను కేంద్ర జలశక్తి శాఖ బుధవారం ఢిల్లీలో నిర్వహించనున్న సమావేశపు ఎజెండాలో గోదావరి బనకచర్ల ప్రాజెక్టును చేర్చడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
గోదావరి నీరు ఎరుపెక్కింది. ఉపనదులైన శబరి, సీలేరు వరద నదిలో కలుస్తుండడంతో ఉధృతి పెరగడంతో పాటు రంగు మార్చుకుంటోంది. ఎగువన మహారాష్ట్రలో మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉప నదులు పొంగి గోదావరిలో కలుస్తున్నాయి.