Share News

Dhavaleswaram Cotton Barrage: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం, ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ

ABN , Publish Date - Aug 30 , 2025 | 09:34 PM

ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఒకటో ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయింది. బ్యారేజ్ వద్ద గంట గంటకూ గోదావరి నీటి ప్రవాహం పెరుగుతోంది. 175 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు.

Dhavaleswaram Cotton Barrage: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం, ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ
Dhavaleswaram Cotton Barrage

రాజమండ్రి, ఆగస్టు 30 : ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఒకటో ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయింది. బ్యారేజ్ వద్ద గంట గంటకూ గోదావరి నీటి ప్రవాహం పెరుగుతోంది. బ్యారేజ్ వద్ద 11.75 అడుగులకు నీటిమట్టం పెరిగింది. 175 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు. 10.10 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.


అల్లూరి జిల్లాలోని లోతట్టు గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ లంక గ్రామాలు వరద జలదిగ్బందంలో ఉన్నాయి. కాజ్ వే లు నీట మునిగాయి. దీంతో లంక గ్రామాల ప్రజలు నాటుపడవలు పైనే రాకపోకలు సాగిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 30 , 2025 | 09:34 PM