Bhadrachalam: మళ్లీ పెరుగుతున్న గోదావరి
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:32 PM
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 3.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేయడంతో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు తగ్గుముఖం పడుతూ వచ్చిన గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది.
- భద్రాద్రి వద్ద రాత్రి 11 గంటలకు 38.3 అడుగులకు చేరిన నీటిమట్టం
- అప్రమత్తమైన అధికారులు
భద్రాచలం: భద్రాచలం(Bhadrachalam) వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 3.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేయడంతో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు తగ్గుముఖం పడుతూ వచ్చిన గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. దీంతో బుధవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద గోదావరి తొలి ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 43 అడుగులకు చేరే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
అంతకు ముందు సోమవారం రాత్రి 11 గంటలకు 38.5 అడుగలకు చేరిన గోదావరి నీటిమట్టం అర్ధరాత్రి ఒంటి గంటకు 38.5 అడుగులకు తగ్గింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు 37.9 అడుగులకు తగ్గగా ఉదయం 6గంటలకు 37.3, 9గంటలకు 36.8, మధ్యాహ్నం 12 గంటలకు 36.4 అడుగులకు చేరింది. మధ్యాహ్నం 3 గంటలకు 36 అడుగులకు తగ్గి.. 4 గంటల నుం చి మళ్లీ క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో సాయంత్రం 6 గంటలకు 36.3 అడుగులకు,
రాత్రి 11 గంటలకు 38.3 అడుగులకు పెరిగింది. బుధవారం సాయంత్రానికి తొలి ప్రమాద హెచ్చరిక స్థాయికి (43 అడుగులకు) చేరే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా గోదావరి స్నానఘట్టాలు నీటమునగడం, ప్రవాహం తొలి ప్రమాద హెచ్చరికకు చేరువవుతుండటంతో అధికారులు ముందు జాగ్రత్తగా గజ ఈతగాళ్లను మోహరించారు. అలాగే భక్తులను స్నానాలకు గోదావరిలోకి దిగకుండా నియంత్రిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...
‘కన్ఫర్డ్’లుగా 17 మంది సిఫారసు!
విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను తీసేయండి
Read Latest Telangana News and National News