Home » Fire Accident
పటాన్చెరులోని పాశమైలారంలో పెను విషాదం చోటుచేసుకుంది. సోమవారం సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రయింగ్ యూనిట్లో ఈ ఘటన జరిగింది. ఈ పేలుడు ఘటనలో 45 మంది కార్మికులు మృతిచెందారు.
బతుకు దెరువు కోసం పొట్టచేతబట్టుకుని వస్తున్న వలస కూలీలు.. అనుకోని ప్రమాదాల బారిన పడుతున్నారు. పరిశ్రమలు, గోదాముల్లో జరుగుతున్న ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నవారు కొందరైతే...
పఠాన్చెరు మండలం పాశ మైలారం పారిశ్రామికవాడలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలడంతో ప్రమాదం జరిగింది. పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి.
Fire Accidents: హైదరాబాద్లో రెండు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఆసిఫ్నగర్, జీడిమెట్లలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే సంఘటనల ప్రదేశాలకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
బాణసంచా కర్మాగారంలో జరిగిన భారీ పేలుడులో ఐదుగురు మహిళలు మృతిచెందగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన, గాయపడ్డ వాళ్లంతా స్థానిక మహిళలే. టపాసులు కడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
దుబాయ్ మరీనా ప్రాంతంలోని 67 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.
రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ పెట్రోల్ బంక్లో శుక్రవారం పేలుడు సంభవించింది. వెల్డింగ్ చేస్తుండగా నిప్పురవ్వలు పెట్రోల్ ట్యాంక్లో పడటంతో ఈ ఘటన జరిగింది.
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ద్వారకా ప్రాంతంలోని అపార్ట్మెంట్లో మంటలు వ్యాపించాయి. ఆరో అంతస్తు నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ మంటల నుంచి తప్పించుకునేందుకు తొమ్మిదో అంతస్తు నుంచి కిందకు ఒక కుటుంబం దూకింది.
Kerala cargo ship: కేరళ తీరంలో కార్గో నౌక ఎంవీ వాన్ హై 503లో హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఊహించని ఘటనతో నౌకలో ఉన్న సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం స్పందించి హుటాహుటిన రక్షణ చర్యలు చేపట్టింది. నౌక అంతర్గత భాగంలోనే పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది.
Fire Accident: గచ్చిబౌలిలో అగ్ని ప్రమాదం జరిగింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్దమైంది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. కారు ఇంజన్ నుంచి మంటలు రావడం గమనించిన ప్యాసింజర్లు వెంటనే అప్రమత్తమై కారు నుంచి దిగిపోయారు.