Fire at Firecracker Warehouse: టపాసుల గోదాంలో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Oct 18 , 2025 | 06:33 PM
సంగారెడ్డి జిల్లా, ఆందోల్ శివారులోని టపాసుల గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గుర్తు తెలియని వ్యక్తి అగ్గి రాజేయడంతో మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: సంగారెడ్డి జిల్లా, ఆందోల్ శివారులోని కటుకం వేణుగోపాల్ & సన్స్ టపాసుల గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గుర్తు తెలియని వ్యక్తి అగ్గి రాజేయడంతో మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.
మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. విక్రయదారులకు తృటిలో పెనుప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. బాణాసంచా గోదాం యాజమాన్యం ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో టపాసుల గోదాం పూర్తిగా కాలి బూడిదైంది.
ఇవి కూడా చదవండి..
పోక్సో కేసుల పరంపర.. తల్లిదండ్రుల ఆందోళన
పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్యకు కేటీఆర్ అండ
Read Latest Telangana News And Telugu News