Dhaka: హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా మంటలు
ABN , Publish Date - Oct 18 , 2025 | 05:41 PM
మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుందని సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ బంగ్లాదేశ్ (సీఏఏబీ) పబ్లిక్ రిలేషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మహమ్మద్ కౌసరి మహమూద్ తెలిపారు. మంటలు పూర్తిగా అదుపులోకి రాగానే ప్రమాదానికి కారణాలపై సమగ్ర విచారణ చేపడతామని అధికారులు తెలిపారు.
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో విలేజ్‌లో శనివారం మధ్యాహ్నం భారీగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్దఎత్తున పొగలు కమ్ముకున్నాయి. ఎయిర్ పోర్ట్ మెయిన్ స్టోరేజీ ఏరియా అయిన కార్గో విలేజ్‌లో మంటలు చెలరేగడంతో సుమారు 30 అగ్నిమాక శకటాలను రంగంలోకి దింపారు. మరింత నష్టం జరక్కుండా భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోనికి తెస్తున్నారు. ప్రమాదం జరగడానికి కారణాలు కానీ, మృతులు, క్షతగాత్రుల సమాచారం కానీ వెంటనే తెలియలేదు.
మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుందని సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ బంగ్లాదేశ్ (సీఏఏబీ) పబ్లిక్ రిలేషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మహమ్మద్ కౌసరి మహమూద్ తెలిపారు. మంటలు పూర్తిగా అదుపులోకి రాగానే ప్రమాదానికి కారణాలపై సమగ్ర విచారణ చేపడతామని అధికారులు తెలిపారు. మరోవైపు, ప్రమాదం కారణంగా విమాన సర్వీసుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే రెగ్యులర్ ప్యాసింజర్ టెర్మినల్ ఆపరేషన్లను మాత్రం సేఫ్టీ ప్రోటోకాల్స్‌తో కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
తీరుమారని పాక్ ఆర్మీ చీఫ్.. మళ్లీ అణు బెదిరింపు వ్యాఖ్యలు
అఫ్ఘానిస్థానీలు మా దేశాన్ని విడిచి వెళ్లాల్సిందే: పాక్ రక్షణ శాఖ మంత్రి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి