Home » Election Commission of India
2025 ఉపరాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ ఆగస్టు 7వ తేదీన విడుదలై ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్‌ల దాఖలు చివరి తేదీ ఆగస్టు 21 కాగా, పరిశీలన ఆగస్టు 22వ తేదీన ముగిసింది. మొత్తం 46 మంది అభ్యర్థులు 68 నామినేషన్ పత్రాలు దాఖలు అయ్యాయి.
ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మీద పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష కూటమి యోచిస్తోంది..
రాజకీయ పార్టీలు లేవనెత్తిన కీలక ప్రశ్నలకు సీఈసీ జ్ఞానేష్ కుమార్ సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారని, ఆయన తన బాధ్యతల నుంచి పారిపోతున్నారని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ విమర్శించారు. ఓటు హక్కు అనేది పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రధానమైన హక్కు అని, దానికి పరిరక్షించేందుకు ఉద్దేశించినదే ఈసీ అని చెప్పారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై మండిపడ్డ బీజేపీ.. ప్రతిపక్షాల నుంచి ఇంతకుమించి ఏమి ఆశించగలమని కామెంట్ చేసింది.
ఇవాళ మ.3 గంటలకు ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించబోతోంది. ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. బీహార్ ఓటరు జాబితా, రాహుల్ ఆరోపణలపై ఈసీ స్పందించే అవకాశం ఉంది.
బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విపక్షాలన్నీ నిప్పులు చెరుగుతూ, జాబితాలో ఉన్న తప్పులపై ప్రశ్నిస్తుండడంపై ఈసీ స్పందించింది.
ఓటర్ జాబితా సవరణకు సంబంధించి అన్ని దశల్లో రాజకీయ పార్టీలకు భాగస్వామ్యం కల్పిస్తామని ఈసీ పేర్కొంది. ఈసారి కూడా ముసాయిదా జాబితాను పార్టీలతో పంచుకున్నామని తెలిపింది. ఆ సమయంలో పార్టీలు అభ్యంతరాలను వ్యక్తం చేయలేదని వెల్లడించింది.
ఓట్ల చోరీ జరిగిందంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్
దేశ రాజకీయం మళ్లీ మరింత వేడెక్కింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, బిహార్ ఎన్నికల ఓటర్ల జాబితాలో తప్పులు జరిగాయని ఇండియా కూటమి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో కూటమి నేడు దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఆందోళనకు సిద్ధమైంది.
'దయచేసి సంబంధిత పత్రాలను అందించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము.. దాని ఆధారంగా శకున్ రాణి లేదా మరెవరైనా రెండుసార్లు ఓటు వేశారా లేదా అనే దానిపై వివరణాత్మక విచారణ నిర్వహిస్తాము' అని ఈసీ తన నోటీసులో రాహుల్ గాంధీని కోరింది.