Supreme Couirt on Bihar SIR: అక్రమ పద్ధతులని తేలితే మొత్తం ప్రక్రియనే పక్కన పెట్టేస్తాం... సుప్రీం కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:35 PM
రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ బిహార్ ఎస్ఐఆర్ ప్రక్రియలో చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటింటాల్సి ఉంటుందని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. బీహార్ ఎస్ఐఆర్ ప్రక్రియలో 12వ గుర్తింపు పత్రంగా ఆధార్‌ను చేర్చాలంటూ సెప్టెంబర్ 8న ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన ఉత్తర్వులను సవరించేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది.
న్యూఢిల్లీ: బిహార్‌లో ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ డ్రైవ్ (SIR)పై సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారంనాడు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ (ECI) ఎలాంటి అక్రమ పద్ధతులు పాటించినట్టు తేలినా మొత్తం ప్రక్రియనే పక్కన పెట్టేస్తామని హెచ్చరించింది. అక్టోబర్ 7న తుది వాదనలు వింటామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ అంశంపై తాము అసంపూర్తి అభిప్రాయం వెల్లడించ లేమని, తుది తీర్పు దేశవ్యాప్త స్పెషల్ ఇంటెన్సివ్ డ్రైవ్ (Pan-India SIR)కు వర్తించేలా ఉంటుందని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చితో కూడిన ధర్మాసనం తెలిపింది.
రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ బిహార్ ఎస్ఐఆర్ ప్రక్రియలో చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. బీహార్ ఎస్ఐఆర్ ప్రక్రియలో 12వ గుర్తింపు పత్రంగా ఆధార్‌ను చేర్చాలంటూ సెప్టెంబర్ 8న ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన ఉత్తర్వులను సవరించేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది.
'డ్రైవింగ్ లెసెన్స్ ఫోర్జరీ కావచ్చు, రేషన్ కార్డులు, డాక్యుమెంటు ఫోర్జరీ కావచ్చు. కానీ చట్ట అనుమతి పరిధిలో ఆధార్ కార్డును ఉపయోగించవచ్చు' అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అక్టోబర్ 7న ఈ అంశాన్ని చేపడతామని, అప్పటిలోగా ఇరు పక్షాలు వాదనలకు సంబంధించిన బ్రీఫ్ నోట్‌లను ప్రిపేర్ చేసుకోవాలని సూచించింది.
ఇవి కూడా చదవండి..
అందుకే పెద్దాయన అప్లికేషన్ తీసుకోలేదు.. సురేష్ గోపి వెల్లడి
వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు
For National News And Telugu News