Share News

Election Commission: బిహార్‌ ఓటరు జాబితాలో విదేశీయులు

ABN , Publish Date - Aug 30 , 2025 | 03:08 AM

నిన్న ఇద్దరు పాక్‌ మహిళలు.. ఇప్పుడు అఫ్ఘానిస్థాన్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ పౌరులు బిహార్‌ ఓటరు జాబితాలో కనిపించారు. వెంటనే అప్రమత్తమైన ఎన్నికల..

Election Commission: బిహార్‌ ఓటరు జాబితాలో విదేశీయులు

న్యూఢిల్లీ, ఆగస్టు 29: నిన్న ఇద్దరు పాక్‌ మహిళలు.. ఇప్పుడు అఫ్ఘానిస్థాన్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ పౌరులు బిహార్‌ ఓటరు జాబితాలో కనిపించారు. వెంటనే అప్రమత్తమైన ఎన్నికల సంఘం(ఈసీ) ఆ జాబితాలో గుర్తించిన విదేశీయులకు నోటీసులు జారీచేసింది. బిహార్‌లో సమగ్ర ఓటరు సవరణ(సర్‌) చేపట్టిన ఈసీ 3లక్షలమందికి నోటీసులు జారీచేసింది. వీరిలో బిహార్‌లో ఓటరుకార్డులు పొందిన పలువురు విదేశీయులు కూడా ఉన్నట్టు ఈసీ వర్గాలు తెలిపాయి. ‘సర్‌’ ప్రక్రియలో భాగంగా ఎన్నికల అధికారులు జరిపిన ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో ఈ విషయం బయటపడింది. ‘‘బిహార్‌ ఓటరు జాబితాను లోతుగా ప్రక్షాళన జరుపుతున్నాం. ఈ ప్రక్రియ ఈ నెల 1న మొదలైంది. శనివారం వరకు కొనసాగుతుంది. ఈ క్రమంలో అనర్హులుగా తేలినవారిని జాబితా నుంచి తొలగిస్తాం. తుది జాబితాను సెప్టెంబరు 30వ తేదీన ప్రకటిస్తాం.’’ అని ఈసీ వర్గాలు తెలిపాయి. నోటీసులు అందుకున్న వారు వారం రోజుల్లో ఎన్నికల అధికారి ఎదుట హాజరై తమ పత్రాలను తనిఖీ చేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. కాగా, ఓటరు జాబితాలో పేర్ల చేర్పు లేక తొలగింపును కోరుతూ గురువారంనాటికి వ్యక్తులనుంచి 1,95,802 దరఖాస్తులు వచ్చాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో 24,991 దరఖాస్తులను ఈసీ ఇప్పటికే పరిష్కరించిందని వెల్లడించింది. ఇక.. సీపీఐ (ఎమ్‌-ఎల్‌) 79 దరఖాస్తులు, ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ మూడు దరఖాస్తులు ఇచ్చిందని తెలిపింది. అభ్యంతరం చెబుతూ బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి ఇంతవరకు ఒక్క దరఖాస్తు కూడా అందలేదని పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..

Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..

Updated Date - Aug 30 , 2025 | 03:08 AM