Share News

Election Commission: 474 రాజకీయ పార్టీలపై ఈసీ వేటు

ABN , Publish Date - Sep 19 , 2025 | 05:13 PM

గత ఆరేళ్లుగా పలు పార్టీలు ఎన్నికల్లో పాల్గొనడం లేనందున వాటిని జాబితా నుంచి తొలగిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. మొదటి విడతగా ఆగస్టు 9న 334 రిజిస్టర్ అయిన గుర్తింపులేని రాజకీయ పార్టీలను జాబితా నుంచి ఈసీ తొలగించింది.

Election Commission: 474 రాజకీయ పార్టీలపై ఈసీ వేటు
Election commission of India

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గుర్తింపులేని రిజిస్టర్డ్ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) మరోసారి చర్యలు తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘించిన 474 పార్టీలను జాబితా నుంచి తొలగించింది. గత ఆరేళ్లుగా ఈ పార్టీలు ఎన్నికల్లో పాల్గొనడం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. మొదటి విడతగా ఆగస్టు 9న 334 రిజిస్టర్ అయిన గుర్తింపులేని రాజకీయ పార్టీలను (RUPPs) జాబితా నుంచి ఈసీ తొలగించింది.


'సెప్టెంబర్ 18న రెండో విడతలో భాగంగా 474 ఆర్‌యూపీపీలను జాబితా నుంచి తొలగించాం. గత ఆరేళ్లుగా ఈ పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉంటున్నాయి. ఈ కారణంగా గత 2 నెలల్లో 808 ఆర్‌యూపీపీలను జాబితా నుంచి తొలగించాం' అని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఇటీవల వరకూ 2,520 ఆర్‌యూపీపీలు ఉండగా, డీలిస్టింగ్ ప్రక్రియ తర్వాత అవి 2,046కు చేరుకున్నాయి. ప్రస్తుతం 6 గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు,67 రాష్ట్ర పార్టీలు ఉన్నాయని ఎన్నికల సంఘం తెలిపింది.


ఇవి కూడా చదవండి..

హఫీజ్‌ను కలిసినందుకు మన్మోహన్ కృతజ్ఞతలు.. అఫిడవిట్‌లో యాసిన్ మాలిక్ వెల్లడి

పాక్ వెళ్లినప్పుడు సొంత ఇంట్లో ఉన్నట్టుంది.. శామ్ పిట్రోటా వ్యాఖలపై బీజేపీ గరంగరం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 19 , 2025 | 05:15 PM