Home » Election Campaign
సార్వత్రిక ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. ఏడో, ఆఖరి దశకు సంబంధించి శనివారం పోలింగ్ జరగనుంది. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ సహా ఈ విడతలో ఏడు రాష్ట్రాల్లోని 57
ఏపీ ఎన్నికల కౌంటింగ్ రోజున ఆందోళనలను ప్రేరేపించేలా ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒడిసా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. బుధవారం రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి భువనేశ్వర్‌కు చేరుకుంటారు. గురువారం ఉదయం భువనేశ్వర్ నుంచి రోడ్డు మార్గంలో వెళ్లి భద్రలోక్ లోక్‌సభ నియోజకవర్గంలో రాహుల్‌తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు.
ఆమె సినిమా ‘క్వీన్’.. ఆయన ఒకనాటి రాజ్యానికి వారసుడు..! వీరి మధ్య ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ కాక పుట్టిస్తోంది. ఇద్దరు అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తూ ఆదరణ చూరగొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత చర్చనీయాంశం అవుతున్న నియోజకవర్గం మండి. ఇక్కడినుంచి బీజేపీ
ఏపీ సార్వత్రిక ఎన్నికల (AP Election 2024) కౌంటింగ్‌కు, ప్రస్తుత హింసాత్మక సంఘటనలకు నేపథ్యంలో జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులు రానున్నారు. పోలింగ్ రోజు, అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ఉన్నతాధికారులను నియమించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) శనివారం కీలక ఆదేశాలు జారీ చేశారు.
చిన్నప్పటి నుంచీ అంతా ఒక్కచోట పెరిగారు. సరదాలు, సంబరాల్లో పాలుపంచుకున్నారు. కలసి పండగలు చేసుకున్నారు. సహపంక్తి భోజనాలు చేశారు. గ్రామంలో అందరిదీ ఒకే మాట. చిన్నా పెద్దా అన్న పట్టింపు పెద్దగా ఉండేది కాదు. 35 ఏళ్ల క్రితం ఎన్నికల సందర్భంగా జరిగిన ఓ చిన్న గొడవ ఆ గ్రామాన్ని ఛిన్నభిన్నం చేసింది.
హిందూ-ముస్లింల మధ్య చిచ్చుపెట్టేలా నిత్యం వ్యాఖ్యలు చేస్తూ, సమాజంలో విద్వేషాలను రెచ్చగొడుతున్న ప్రధాని మోదీ ప్రజా జీవితం నుంచి వైదొలగాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్ చేశారు.
ఒక్క కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే భరతమాత వేలాది మంది కేజ్రీవాల్‌లకు జన్మనిస్తుందని ప్రధాని మోదీని ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హెచ్చరించారు. అరెస్టుల ద్వారా ఆప్‌ను నాశనం చేయలేరని, ఆప్ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అది ఒక ఆలోచనాధార అని చెప్పారు.
సార్వత్రిక ఎన్నికలు ముగింపునకు వస్తున్నాయి. ఈ నెల 20వ తేదీన ఐదో విడతలో 49 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, అందులో 14 నియోజకవర్గాలు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి.
గత డెబ్బయి ఏళ్లుగా చేతిలో బాంబులు పెట్టుకొని బెదిరించిన పాకిస్థాన్ ఇప్పుడు భిక్షాపాత్ర పట్టుకొని తిరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. గత పదేళ్లుగా కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండటం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. హరియాణాలోని అంబాలాలో శనివారం జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు.