Home » Earthquake
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదయ్యింది. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 7:04 గంటల ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది.
వెనెజువెలా దేశాన్ని వరుస భూకంపాలు కుదిపేస్తున్నాయి. బుధవారం నాడు సంభవించిన రెండు భూకంపాలతో ఆ దేశం అతలాకుతలం అవుతోంది. వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది ఆచూకీ గల్లంతైంది. తాజాగా మరో భూకంపం వెనెజువెలాను కుదిపేసింది.
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను భూకంపాలు వణికిస్తున్నాయి. గత వారం రోజుల్లోనే వెనెజువెలా, జపాన్, ఫిలిప్పీన్స్, నికరాగువా, అమెరికా దేశాల్లో భూకంపాలు సంభవించి పెను విషాదాన్ని మిగిల్చాయి. తాజాగా పాకిస్థాన్‌లోనూ భూకంపం సంభవించింది.
భూకంపం మొదలయ్యే కొన్ని సెకన్ల ముందు ప్రజల్ని హెచ్చరించే వ్యవస్థను చాలా దేశాలు అభివృద్ధి చేశాయి. ఇలాంటి ఎర్లీ ఎర్త్‌క్వేక్ వార్నింగ్(ఈఈడబ్ల్యూ) వ్యవస్థలు లేని వెనెజువెలా వంటి దేశాల్లో గూగుల్ ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికలు...
విపత్కర పరిస్థితుల్లో వెనెజువెలాకు అండగా నిలిచేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. ఈ తరుణంలో, తమ దేశానికి సంఘీభావం తెలుపుతూ తక్షణ సహాయాన్ని అందిస్తున్న ప్రపంచ దేశాల అధినేతలకు వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ రోజు (గురువారం) మరోసారి డెల్సీ రోడ్రిగ్జ్ భూకంపాలపై ప్రకటన చేశారు. మృతుల సంఖ్య 164కు చేరిందని తెలిపారు. 971 మంది గాయపడినట్లు వెల్లడించారు.
వెనెజువెలాను బుధవారం నాడు వరుస భూకంపాలు కుదిపేసిన సంగతి తెలిసిందే. 39 సెకన్ల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు సంభవించి తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. భూకంపంతో అనేక భవనాలు నేలమట్టం కాగా.. ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న అనేక వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాను వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు వణికించాయి. శక్తిమంతమైన ప్రకంపనలతో రాజధాని కారకస్‌తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు ఊగిపోయాయి.
వెనెజువెలాలో ఒక నిమిషం వ్యవధిలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. అమెరికా భూగర్భ శాస్త్ర సర్వే ప్రకారం మొదట 7.2 తీవ్రతతో, ఆ తర్వాత 7.5 తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి.
ఉత్తర జపాన్‌లో 6.9 తీవ్రతతో ఈరోజు (గురువారం) భారీ భూకంపాలు సంభవించాయి. హోన్షు ప్రధాన ద్వీపంలోని ఇవాటే ఉత్తర ప్రాంతానికి దూరంగా భూకంపాలు ఏర్పడ్డాయని, దీని కేంద్రం సముద్ర మట్టానికి 50 కిలోమీటర్ల లోతులో ఉందని జపాన్ వాతావరణ సంస్థ అధికారులు తెలిపారు.