Home » DMK
విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) మైనారిటీ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై డీఎంకే నాయకుడు, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సుదీర్ఘకాల మిత్రపక్షాలైన డీఎంకే, కాంగ్రెస్ మధ్య చెడిన బంధం.. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపుతోంది.
మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళనాడులో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై సంచలన కామెంట్లు చేశారు. విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలొచ్చని అన్నారు. ముందస్తు ఎన్నికలకు డీఎంకే శ్రేణులు సిద్ధంగా ఉండాలని చెప్పారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, టీవీకే ప్రభుత్వంపై డీఎంకే పార్టీ సీనియర్ నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీవీకే ప్రభుత్వం ఆరు నెలల కంటే ఎక్కువ అధికారంలో ఉండదని అన్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజాగా చేసిన రాజకీయ వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల విషయంలో తనపై వస్తున్న అనేక ప్రచారాలపై స్పందించారు.
తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల క్రితం ఉదయనిధి సనాతన ధర్మంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చుతూ దానిని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు.
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ కొత్త సాంప్రదాయానికి తెర తీశారు. మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. కొద్ది నిమిషాల పాటు స్టాలిన్‌తో విజయ్ భేటీ కావడం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడు నూతన సీఎం విజయ్‌పై మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలు ఆపాలంటూ విజయ్‌కు చురకలంటించారు.
గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు మిగిల్చిందంటూ సీఎం విజయ్ చేసిన విమర్శపై డీఎంకే అధినేత స్టాలిన్ ఘాటుగా విమర్శించారు. మంచి పాలన అందించడమనేది పాలకుల పట్టుదలపై ఆధారపడి ఉంటుందని కామెంట్ చేశారు.
టీవీకే సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ అన్నాడీఎంకే పార్టీ చీఫ్ పళనిస్వామి పెట్టిన పోస్టు ఉత్కంఠను మరింత పెంచింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న పార్టీకి శుభాకాంక్షలు చెబుతూ ఆయన పోస్టు పెట్టారు. కానీ ఆ పార్టీ పేరును మాత్రం ప్రస్తావించలేదు.