Home » Devotional
చంద్రగ్రహణం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివారం పలు ఆలయాలను మూసివేయనున్నారు. తిరిగి సోమవారం దేవస్థానాల సంప్రోక్షణ అనంతరం తెరుస్తామని ఆలయాల అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆలయాల అధికారులు పేర్కొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ 2 లక్షల 61 వేలకు పైగా గణేష్ ప్రతిమలను నిమజ్జనం చేశారు. ఒక్క హుస్సేన్ సాగర్‌లోనే 11వేల గణేశ్ విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది. శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా వినాయకులకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా గణేశ్ శోభాయాత్రలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనాలతో భక్తులు పరవశించిపోతున్నారు. ఇక, హైదరాబాద్ మహానగరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేల సంఖ్యలో గణనాథుని విగ్రహాలు నగరవ్యాప్తంగా కొలువుదీరాయి. కాగా, ఇవాళ(శనివారం) 11వ రోజు కావడంతో వందల సంఖ్యలో విగ్రహాలు హుస్సేన్ సాగర్‌తో సహా పలు ప్రాంతాల్లో నిమజ్జనం అవుతున్నాయి. ఆ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం..
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని రేపు ఆదివారం సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా 12 గంటలకు మూసివేయనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని మూసివేసి ఎల్లుండి ఉదయం తెల్లవారుజామున 3.30గంటలకు ఆలయాన్ని ఆలయ అధికారులు తెరవనున్నారు.
ఖైరతాబాద్ విశ్వమహాగణపతి శోభాయాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. హుస్సేన్‌సాగర్ వద్ద బడా గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ గణపతి శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.
హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ నిమజ్జనాల సందర్భంగా లడ్డూ వేలం పాటలను నిర్వాహకులు వైభవంగా నిర్వహిస్తున్నారు. సిటీలో మాదాపూర్ మై హోమ్ భుజా గణేష్ లడ్డూకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రతి ఏడాది అంతకంతకూ ఈ లడ్డూ ధర రికార్డ్ బ్రేకవుతోంది.
ఆ రాశి వారికి ఈ వారం ఖర్చులు విపరీతంగా ఉంటాయని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. లావాదేవీలపై శ్రద్ధ పెట్టాలని, తొందరపాటు నిర్ణయం నష్టం కలిగిస్తుందని తెలుపుతున్నారు. గ్రహస్థితి సామాన్యమని, ఆచి తూచి అడుగేయడం మంచిదని సూచిస్తున్నారు. ఇంకా.. ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...
దొంగ దండాలు పెడితే వినాయకుడు క్షమించరని.. వాళ్ల సంగతి చూస్తారని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు లేకుండా ఏపీ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
మీ కలలో వినాయకుడు కనిపించాడా? మీరు మీ కలలో గణేశుడి విగ్రహాన్ని చూసినట్లయితే, స్వప్న శాస్త్రం ప్రకారం ఆ కలకు అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..