Home » Delhi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీకి సోమవారం బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ సాయంత్రం 4:45గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.
కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.
రైల్లో కిటికీ పక్కన కూర్చొని ప్రయాణిస్తున్న ఓ మహిళ ఫోన్‌ను చటుక్కున లాగేసుకొని ఓ రైల్వే పోలీసు ప్రాంక్ చేశారు. దొంగలు ఇలా ఫోన్‌ను లాక్కొని పారిపోయే అవకాశం ఉందని ప్రాక్టికల్ చేసి చూపించారు. ఒక్కసారిగా తన ఫోన్‌ను లాగేసుకునేసరికి సదరు మహిళ షాక్‌కు గురయ్యారు. ఫోన్ లాక్కుంది పోలీసేనని గ్రహించి ఒక నవ్వు నవ్వారు. 'హమ్మయ్య నా ఫోన్ సేఫ్' అని భావించి తన ఫోన్‌ని తిరిగి తీసుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 16వ తేదీన కర్నూలు జిల్లా పర్యటనకు ప్రధాని మోదీ రానున్నారు. ఉదయం 7:50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్నారు.
కొంతమంది మహిళలు కార్వా చౌత్ వేడుకలకు సిద్ధమయ్యారు. అందరూ ఒక చోట గుంపుగా చేరారు. కార్వా చౌత్ కోసం మెహందీ పెట్టించుకుంటూ ఉన్నారు. ఇంత వరకు అంతాబాగానే ఉంది.
ఢిల్లీలో స్వామి వారి భక్తులకు ఎప్పటికప్పుడు స్వామివారి కార్యక్రమాలు తెలియజేస్తానని.. తిరుమలలో స్వామివారికి జరిగే కైంకర్యాలు ఢిల్లీ టీటీడీ ఆలయంలో జరిగేలా చూస్తానని సుమంత్ రెడ్డి వెల్లడించారు.
అక్టోబర్ 2వ తేదీన దినేష్ గాఢ నిద్రలో ఉన్నాడు. శరీరం మండుతున్నట్లు అనిపించటంతో ఠక్కున కళ్లు తెరిచాడు. పక్కన భార్య నిలబడి ఉంది. వేడివేడి నూనె అతడి శరీరంపై పోస్తూ ఉంది.
ఉత్తర ప్రదేశ్‌లోని ఓ మహిళా ఐఏఎస్ అధికారిణికి అనూహ్య పరిణామం ఎదురైంది. న్యూఢిల్లీలోని అధికారిక బంగ్లాను అనధికారికంగా వాడుకున్నందుకు రూ.1.63 కోట్ల పరిహారం చెల్లించాలంటూ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థ ఆమెకు నోటీసులు జారీ చేసింది.
సాంస్కృతిక వారసత్వం, సంచార జాతుల ప్రజలు ఉండే ప్రాంతంలో సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పడుతుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. అత్యుత్తమ రీసెర్చ్ యూనివర్సిటీగా సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిలుస్తుందని ఉద్ఘాటించారు.
అన్నదాతలు అందరూ ఒకేసారి పత్తిని జిన్నింగ్ మిల్స్‌కి తీసుకురావడంతో పంట కొనుగోలు చేయడంలో ఇబ్బంది ఏర్పడుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో ముందస్తుగానే పత్తిని ఏ రోజు తీసుకువస్తారనేది రిజిస్టర్ చేసుకుంటే సమస్య ఉండదని కిషన్‌రెడ్డి తెలిపారు.