CM Chandrababu Delhi Visit: ఢిల్లీకి సీఎం.. కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
ABN , Publish Date - Dec 18 , 2025 | 04:44 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆరుగురు కేంద్ర మంత్రులతో సమావేశమై వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర సాయంపై చర్చించనున్నారు.
అమరావతి, డిసెంబర్ 18: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మరికాసేపట్లో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రేపు (శుక్రవారం) ఆరుగురు కేంద్రమంత్రులతో సీఎం సమావేశంకానున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ఈరోజు ముఖ్యమంత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. శుక్రవారం ఆరుగురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్, పెట్రోలియం-సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర నౌకాయాన, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌తో సీఎం చంద్రబాబు సమావేశంకానున్నారు. కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులు, అమలు చేస్తున్న కార్యక్రమాలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు.
తిరిగి రేపు రాత్రికి అమరావతికి రానున్నారు. ఆపై శనివారం (ఈనెల 20) అనకాపల్లి జిల్లాలో జరిగే ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి...
అందుకే మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాం: కోటంరెడ్డి
ఎకనామిక్ టైమ్స్ అవార్డుపై సీఎం చంద్రబాబు రియాక్షన్
Read Latest AP News And Telugu News