Minister Lokesh: సీఎంకు ఎకనామిక్ టైమ్స్ అవార్డుపై లోకేష్ ట్వీట్...
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:49 PM
‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్’గా సీఎం చంద్రబాబుకు అవార్డు రావడం ఏపీకి, తమ కుటుంబానికి ఎంతో గర్వకారణమని మంత్రి లోకేష్ అన్నారు.
అమరావతి, డిసెంబర్ 18: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడకు (CM Chandrababu Naidu) ప్రతిష్టాత్మక ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్’గా అవార్డు రావడం పట్ల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. అవార్డుపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ స్పందించారు. సీఎం చంద్రబాబుకు బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం ఏపీకి గర్వకారణమన్నారు. తమ కుటుంబానికి ఈ అవార్డు ఎంతో ప్రతిష్టాత్మకం అని మంత్రి లోకేష్ తెలిపారు.
లోకేష్ ట్వీట్
'సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మా కుటుంబానికి ఇది ఎంతో ప్రతిష్టాత్మకం. దేశంలో సంస్కరణల ప్రయాణాన్ని స్పష్టత, ధైర్యం, స్థిరత్వంతో ముందుకు తీసుకెళ్లిన అరుదైన నాయకుల్లో చంద్రబాబు ఒకరని జ్యూరీ ప్రశంసించింది. పాలనలో సంస్కరణలు, వేగం, విశ్వాసం అనే మూడు సూత్రాలపై ఆయన చూపిన అచంచల నిబద్ధతకే ఈ అవార్డు నిదర్శనం. రాష్ట్రాభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు, సంస్కరణాత్మక పాలనకు చంద్రబాబు నాయకత్వం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది. సంస్కరణలే మార్గం – పాలనలో విశ్వాసమే మా లక్ష్యం’ అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.
మంత్రుల అభినందనలు...

అలాగే సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు రావడంపై మంత్రులు అభినందనలు తెలియజేశారు. సీఎంకు ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు రావడంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించే అవార్డు ఈసారి సీఎం చంద్రబాబు నాయుడును వరించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సీబీఎన్ బ్రాండ్‌తో ఏపీలో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయన్నారు. విజన్ 2047కు అనుగుణంగా స్నేహపూర్వక వ్యాపార అనుకూల విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, భారీ ఇన్సెంటివ్ లు తదితర పారిశ్రామిక సంస్కరణలతో అవార్డు దక్కిందని మంత్రి వెల్లడించారు.
ఏపీపై ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతోందనడానికి వెల్లువలా వస్తున్న పెట్టుబడులే నిదర్శనమని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సీబీఎన్ నాయకత్వం,అధునాతన సాంకేతికతను అనుసంధానం చేస్తూ ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణలు కీలకంగా మారాయన్నారు. ప్రాజెక్టు మీది.. భరోసా మాది.. ఏపీలో పెట్టుబడి పెట్టి మీరు ప్రారంభించే ప్రాజెక్టులను ప్రభుత్వానివిగా భావిస్తామన్న మాట ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపిందని చెప్పుకొచ్చారు. కేంద్రం సహకారం, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ల నేతృత్వంలో పర్యాటకాభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
ఏపీకి సీబీఎన్ బ్రాండ్ అంబాసిడర్: మంత్రి సవిత

సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పనితీరుకు, నిబద్ధతకు ఎకనమిక్ టైమ్స్ సంస్థ అవార్డు నిదర్శనమన్నారు. సీఎం చంద్రబాబుకు అవార్డు రావడం ఏపీకే గర్వకారణమని తెలిపారు. చంద్రబాబు పాలనలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ కావడం ఖాయమని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం అమలు చంద్రబాబుకే సాధ్యమని చెప్పుకొచ్చారు. ఏపీకి సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని తెలిపారు. చంద్రబాబు సమర్థత వల్లే 18 నెలల కాలంలో రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి సవిత వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌పై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
అందుకే మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాం: కోటంరెడ్డి
Read Latest AP News And Telugu News