AP Collectors Conference: రొటీన్‌కు భిన్నంగా కలెక్టర్ల కాన్ఫరెన్స్.. సీఎం హర్షం
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:23 PM
కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆరు జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన బెస్ట్ ప్రాక్టీసెస్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన కొన్ని ప్రాజెక్టులు దేశానికే ఆదర్శంగా ఉన్నాయంటూ కితాబిచ్చారు.
అమరావతి, డిసెంబర్ 18: 5వ కలెక్టర్ల కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కొత్త విధానాన్ని అవలంభించారు. వివిధ జిల్లాల్లో కలెక్టర్లు అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్‌ను ఆయా జిల్లాల కలెక్టర్లతోనే సీఎం ప్రజెంటేషన్ ఇప్పించారు. ఆరు జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన బెస్ట్ ప్రాక్టీసెస్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన కొన్ని ప్రాజెక్టులు దేశానికే ఆదర్శంగా ఉన్నాయంటూ కితాబిచ్చారు. రొటీన్‌గా కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా కలెక్టర్ల కాన్ఫరెన్సులో చర్చ జరిగినందుకు ఆనందంగా ఉందన్నారు.
జిల్లాల్లో అత్యుత్తమ విధానాల ద్వారా సేవలందిస్తున్న కలెక్టర్లను అభినందించారు. వచ్చే కలెక్టర్ల సమావేశం నాటికి ప్రజలకు ఉపయోగపడే మరిన్ని వినూత్న ఆలోచనలు, కార్యక్రమాలతో రావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
కలెక్టర్లు ఇచ్చిన ప్రజెంటేషన్స్ ఇవే..
వివిధ అంశాలపై అల్లూరి, పార్వతిపురం మన్యం, ఏలూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
విద్యార్థుల్లో ప్రతిభను ప్రొత్సహించేలా రూపొందించిన ప్రాజెక్ట్ నిర్మాణ్ గురించి అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వివరించారు.
విద్యార్థులు పరిశుభ్రత, హైజినీక్ కండిషన్స్ పాటించేలా రూపొందించిన ముస్తాబు కార్యక్రమాన్ని పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రజెంట్ చేశారు.
నాటుసారా తయారీదారుల జీవితాల్లో మార్పు తెస్తూ.. వారిని మైక్రో ఎంటర్ ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దేలా రూపొందించిన ప్రాజెక్ట్ మార్పు కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వీ ప్రజెంట్ చేశారు.
రైతుల్లో సాధికారత, ఆర్థిక లబ్ది, వ్యవసాయంలో ఉత్తమ విధానాల పాటించేలా రూపొందించిన ఛాంపియన్ ఫార్మర్స్ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా హిమాన్షు శుక్లా వివరించారు.
విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్నం భోజనంలో అందించేందుకు ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్లపై కడప కలెక్టర్ సీహెచ్ శ్రీధర్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
రెవెన్యూ రికార్డుల ట్యాంపర్ చేయకుండా చేపట్టిన డిజిటలైజేషన్ విధానం, ఏఐ వినియోగంపై రూపొందించిన ప్రాజెక్టును అనంతపరం జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రజెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌పై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
అందుకే మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాం: కోటంరెడ్డి
Read Latest AP News And Telugu News