Home » Damodara Rajanarasimha
రోడ్డుప్రమాద బాధితులను రక్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
సమాజంలో ఎయిడ్స్ నివారణపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ రోజు(గురువారం) రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, మానవ హారాలు, మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వ్యాఖ్యానించారు. హెచ్‌ఐవీ అనేది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలహీనపరచే వైరస్ అని తెలిపారు.
మహిళల ప్రాణాలను హరిస్తున్న గర్భాశయ క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నివారణ దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. సర్వైకల్ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా శనివారం హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ పంపిణీకి శ్రీకారం చుట్టింది. వివరాల్లోకి వెళితే..
నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
పేద ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వ్యాఖ్యానించారు. అమెరికాకు చెందిన తులసి థెరప్యుటిక్స్ సహకారంతో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు.
ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటా విద్యార్థుల నుంచి హాస్టల్, మెస్ పేరుతో అదనపు ఫీజుల వసూళ్లపై నిఘా పెంచాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. అలాగే ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులు, యాజమాన్యాల తీరుపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
చికిత్స మధ్యలో రోగులను డిశ్చార్జి చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శాఖ అధికారులను ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజారోగ్యానికి ఇబ్బంది తలెత్తకుండా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు(డీఎం అండ్ హెచ్‌ఓ) అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
భారీ వర్షాలు, వరదలు వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు దామోదరరాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, ధనసరి అనసూయ(సీతక్క) పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని ఈర్లపల్లి తండాకు చెందిన రవినాయక్ మృతికి సకాలంలో చికిత్స అందకపోవడమే కారణమని పత్రికల్లో వచ్చిన వార్తలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విచారణకు ఆదేశించారు. ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, విచారణ జరిపించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.