Home » Cyclone
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
ఈదురు గాలులు, భారీ వర్షాల మూలంగా కలిగిన నష్టంపై డిప్యూటీ సీఎం వివరాలు తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతో విద్యుత్ తీగలు పడటం, విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన క్రమంలో వాటి పునరుద్ధరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని ఏడు తీర ప్రాంత జిల్లాలపై మొంథా తుఫాన్ పంజావిసిరింది. ప్రచండ వేగంతో వీచిన పెనుగాలులు, భారీవర్షాలతో బీభత్సం సృష్టించింది.
మొంథా తుపానుని ఎదుర్కొనేందుకు అధికారులందరూ 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏ ఒక్క ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సూచించారు.
మచిలీపట్నానికి 70 కిలోమీటర్లు, కాకినాడకు 150 కిలోమీట్లరు, విశాఖపట్నానికి 250 కిలోమీటర్ల దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను మంగళవారం ఉదయం తీవ్ర తుపానుగా బలపడిందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీ కోసం
తుపాను నేపథ్యంలో ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సహాయక చర్యలు, పునరావాసం, నష్టం అంచనా అంశాలపై ఫోకస్ పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
మొంథా తుపాను ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో రహదారులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ అధికారులు ఆంక్షలు విధించారు. జాతీయ రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను ఇవాళ(మంగళవారం) రాత్రి 7 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
మొంథా తుపాను విజయవాడ ప్రజలను భయభ్రాంతులకి గురిచేస్తోంది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇప్పటికే విద్యాసంస్థలకు సెలువులు ప్రకటించారు.
భారీ వర్షాల కారణంగా చీరాల నుంచి పాకాల వరకు ఉన్న లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. చీరాలలో చేనేత మగ్గాలు కూడా నీట మునిగిపోయాయి. రబీ సీజన్‌లో వేసిన పంటలు పూర్తిగా నీట మునిగిపోయాయి.