-
-
Home » Andhra Pradesh » Guntur » Montha Cyclone live updates watch here vreddy
-
LIVE UPDATES: క్షణక్షణానికి మారుతున్న వాతావరణం..
ABN , First Publish Date - Oct 28 , 2025 | 10:36 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను మంగళవారం ఉదయం తీవ్ర తుపానుగా బలపడిందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీ కోసం
Live News & Update
-
Oct 28, 2025 19:55 IST
ప్రకాశం: తుఫాన్ ఎఫెక్ట్‌తో జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు
ఈదురుగాలులతో ఒంగోలు, తీరప్రాంత గ్రామాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా.
నాగులుప్పలపాడు మండలం చదలవాడ దగ్గర రామన్న చెరువుకు గండి.
ఒంగోలు-చీరాల రహదారిపైకి చేరిన వరద నీరు, ట్రాఫిక్ మల్లించిన పోలీసులు.
అలుగు పారుతున్న సంతనూతలపాడు చెరువు.
ఒంగోలు-చీమకుర్తి రహదారిపై ప్రవహిస్తున్న నీళ్ళు.
-
Oct 28, 2025 19:53 IST
క్షణక్షణానికి మారుతున్న వాతావరణం..
విజయవాడ: తుఫాన్ నేపథ్యంలో క్షణక్షణానికి మారుతున్న వాతావరణం.
కృష్ణాజిల్లా వ్యాప్తంగా బలమైన ఈదురు గాలులు.
తుఫాన్ ప్రభావంతో నిర్మానుషంగా మారిన రహదారులు.
విజయవాడ నగరంలో సైతం ఇళ్ళకే పరిమితమైన ప్రజలు.
-
Oct 28, 2025 19:37 IST
అమరావతి: మచిలీపట్నంలో హైఅలర్ట్
500 వందల అడుగులు ముందుకు వచ్చిన సముద్రం.
ఈదురుగాలులతో నేలకులుతున్న భారీ వృక్షాలు.
పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం.
70-80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు.
-
Oct 28, 2025 17:50 IST
పునరావాస కేంద్రాలకు తీర ప్రాంత ప్రజల తరలింపు
APSDMA స్టేట్ కంట్రోల్ రూమ్: 112, 1070, 1800 425 0101.
'మొంథా' తుఫాన్ ప్రభావంతో కోనసీమ జిల్లాలో ఇద్దరు మృతి.
మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో ఏపీలోని తీరప్రాంతంలో అల్లకల్లోలం.
-
Oct 28, 2025 17:42 IST
మరింత బలపడిన మొంథా తుపాను..
అమరావతి: మొంథా తుపాను తీవ్రతుపానుగా బలపడింది.
దీని ప్రభావంతో ఈ రోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయి.
తీరం దాటే సమయంలోబలమైన ఈదురుగాలులు వీస్తాయి.
ఇంట్లోనే సురక్షితంగా ఉండండి.
అత్యవసరం అయితే తప్పితే బయటకు రావద్దు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
-
Oct 28, 2025 15:53 IST
కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
తీరందాటే సమయంలో గంటకు 90-110 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం
-
Oct 28, 2025 15:53 IST
అలలు ఎగసిపడే అవకాశం
కాకినాడ తీరంలో ఒక మీటరు వరకు అలలు ఎగసిపడే అవకాశం
ఇవాళ శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా వరకు అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్
ఇవాళ గంటకు 75 నుంచి 85 కిలోమీటర్లు వేగంతో గాలులు
సాయంత్రానికి గాలులు తీవ్రత మరింత పెరిగే అవకాశం
రానున్న మూడురోజుల పాటు మత్య్సకారుల చేపల వేటకు వెళ్లరాదన్న అధికారులు
కాకినాడ పోర్ట్ కు పదో నెంబర్ ప్రమాదం హెచ్చరిక
విశాఖ, గంగవరం పోర్టులకు తొమ్మిదవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ
-
Oct 28, 2025 15:53 IST
నిలిచిన విద్యుత్ సరఫరా
ప.గో.: పాలకొల్లులో ఈదురుగాలులు, నిలిచిన విద్యుత్ సరఫరా
నేలకొరిగిన చెట్లు తొలగింపు, రెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు
-
Oct 28, 2025 15:51 IST
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలుచోట్ల వర్షాలు
తుపాన్ కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తేలికపాటి వర్షాలు
తుపాన్ ప్రభావంతో తిరుమలలో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం
-
Oct 28, 2025 15:50 IST
మంత్రి డీఎస్‌బీవీ పర్యటన
ప్రకాశం: తుఫాను దృష్ట్యా క్షేత్రస్థాయిలో మంత్రి డీఎస్‌బీవీ స్వామి క్షేత్రపర్యటన
సింగరాయకొండ మండలం ఊల్లపాలెం, పల్లెపాలెంలో డీఎస్‌బీవీ స్వామి పర్యటన
పునరావాస కేంద్రాలను పరిశీలించిన మంత్రి డీఎస్‌బీవీ స్వామి
-
Oct 28, 2025 13:35 IST
దిశ మార్చుకున్న 'మొంథా' తుఫాన్
కోనసీమ జిల్లా పరిసరాల్లో రాత్రికి తీరం దాటే అవకాశం
-
Oct 28, 2025 13:29 IST
దిశ మార్చిన మొంథా తుఫాన్
అమలాపురం యానాం సమీపంలో తీరం దాటనున్న తీవ్ర తుఫాన్
కోనసీమ జిల్లా పరిసర తీర ప్రాంతాలలో రాత్రికి తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు ప్రకటించిన కోనసీమ జిల్లా ప్రత్యేక అధికారి విజయ రామరాజు
కోనసీమ జిల్లా సముద్ర తీర ప్రాంతానికి ఒక కిలోమీటర్ పరిధిలో పక్కా గృహాలలో నివసిస్తున్న వారిని యుద్ధ ప్రాతిపదికన తరలింపు
అటు కోనసీమలో భారీగా నెలకులుతున్న కొబ్బరి చెట్లు.. ఇప్పటికే ఇద్దరు మృతి
-
Oct 28, 2025 13:17 IST
తుఫాన్ కల్లోలం..
-
Oct 28, 2025 13:16 IST
'మొంథా' తుఫాన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష
హాజరైన డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు లోకేష్, అనిత, నారాయణ, సీఎస్
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచన
గతంలో తుఫానుల నష్టాన్ని బేరీజు వేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
తుఫాను తీరం దాటే కాకినాడ, పరిసర ప్రాంతాలకు సహాయ సిబ్బంది పంపించాలని ఆదేశం
గాలులు, వర్ష తీవ్రతను అంచనా వేసి అందుకు తగినట్టుగా జాగ్రత్త వహించాలని సూచన
తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశామని తెలిపిన సీఎస్ విజయానంద్
-
Oct 28, 2025 13:14 IST
చెన్నైని తాకిన తుఫాన్
-
Oct 28, 2025 13:11 IST
గోదావరి, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు
-
Oct 28, 2025 12:35 IST
-
Oct 28, 2025 12:24 IST
తుఫాన్ ప్రభావం ఉన్న కోస్తా జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్
APSDMA స్టేట్ కంట్రోల్ రూమ్: 112, 1070, 1800 425 0101
కంట్రోల్ రూమ్: శ్రీకాకుళం 08942-240557, విజయనగరం 08922-236947
కంట్రోల్ రూమ్: మన్యం 08963-293046, అల్లూరి 08935-293448
కంట్రోల్ రూమ్: విశాఖ 0891-2590102/100, అనకాపల్లి 089242-22888
కంట్రోల్ రూమ్: కాకినాడ 0884-2356801, కోనసీమ 08856-293104
కంట్రోల్ రూమ్: తూ.గో. 89779 35611, ప.గో. 08816-299181
కంట్రోల్ రూమ్: ఏలూరు 1800-233-1077, కృష్ణా 08672-252572
కంట్రోల్ రూమ్: ఎన్టీఆర్ 91549 70454, గుంటూరు 0863-2234014
కంట్రోల్ రూమ్: బాపట్ల 08643-220226, పల్నాడు 08647-226999
కంట్రోల్ రూమ్: ప్రకాశం 99497 64896, నెల్లూరు 0861-2331261, 79955 76699
కంట్రోల్ రూమ్: కర్నూలు 08518-277305, నంద్యాల 08514-293903
కంట్రోల్ రూమ్: అనంతపురం 85002 92992, శ్రీసత్యసాయి 85552 89039
కంట్రోల్ రూమ్: కడప 08562-246344, అన్నమయ్య 08561-293006
కంట్రోల్ రూమ్: చిత్తూరు 94910 77356, తిరుపతి 0877-2236007
-
Oct 28, 2025 12:23 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న మొంథా తుఫాన్ తీవ్రతపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఇతర ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు.
-
Oct 28, 2025 12:21 IST
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు సాయానికి సిద్ధంగా ఉండాలి: వైఎస్ షర్మిల
-
Oct 28, 2025 12:20 IST
తుఫాన్‌తో రేపు విశాఖ మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు
విశాఖ: 10 ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు, ఒక రైలు దారి మళ్లింపు
-
Oct 28, 2025 12:20 IST
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా 'మొంథా'
రాత్రికి కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం
శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లాలో అతి భారీ వర్షాలు
కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం
-
Oct 28, 2025 12:07 IST
విజయవాడ డివిజన్ పరిధిలో మరో 11 రైళ్లు రద్దు
విజయవాడ డివిజన్‌లో ఇప్పటివరకు మొత్తం 116 రైళ్లు రద్దు
-
Oct 28, 2025 12:07 IST
'మొంథా' తుఫాన్‌పై అధికారులతో కలెక్టర్ లక్ష్మీ షా సమీక్ష
అవేర్ యాప్ ద్వారా తుఫాన్ గమనాన్ని పరిశీలిస్తున్నాం: కలెక్టర్ లక్ష్మీ షా
ప్రత్యేక బృందాలతో అప్రమత్తంగా ఉన్నాం: కలెక్టర్ లక్ష్మీ షా
కృష్ణా నదితో పాటు బుడమేరు, వెలగలేరు వాగులపై పర్యవేక్షణ
విజయవాడ అర్బన్ పరిధిలో కొండ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్ లక్ష్మీ షా
-
Oct 28, 2025 12:06 IST
'మొంథా' తుఫాన్‌పై RTGSలో మంత్రి లోకేష్ సమీక్ష
పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయాలి: మంత్రి లోకేష్
వివిధ పంటలకు వాటిల్లిన నష్టంపై మంత్రి లోకేష్ ఆరా
-
Oct 28, 2025 12:01 IST
తుఫాన్ ఎఫక్ట్ పై ABN ప్రత్యేక కథనం
-
Oct 28, 2025 11:59 IST
ప.గో.: భీమవరం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెం. 08816 299219
భీమవరం RDO ఆఫీస్ నెం. 98484 13739, 87907 31315
నరసాపురం RDO ఆఫీస్ నెం. 93911 85878
తాడేపల్లిగూడెం RDO ఆఫీస్ నెం. 93817 01036, 98497 12358
-
Oct 28, 2025 10:45 IST
తీవ్ర తుఫాన్‌గా 'మొంథా'
సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం
ఏపీ, యానాం, దక్షిణ ఒడిశాకు రెడ్ అలర్ట్
-
Oct 28, 2025 10:44 IST
మచిలీపట్నం సరిహద్దు గ్రామాల్లో పరిస్థితి ఇలా..
-
Oct 28, 2025 10:42 IST
శ్రీకాకుళం: వజ్రపుకొత్తూరు మండలంలో పొంగుతున్న వాగులు
నగరంపల్లి-పెద్దబాడం మధ్య కల్వర్టుకు గండి, నిలిచిన రాకపోకలు
పలాస మం. కంబిరిగాం దగ్గర వరహాలు గెడ్డ ఉధృతి, నిలిచిన రాకపోకలు
ఇచ్ఛాపురం మడలం బూర్జపాడు దగ్గర కూలిన విద్యుత్ స్తంభం
బూర్జపాడు, శివకృష్ణాపురం సహా 5 గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా
శ్రీకాకుళం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 08942-240557
-
Oct 28, 2025 10:41 IST
తెలంగాణపై మొంథా తుఫాన్ ఎఫెక్ట్
ఉత్తర, ఈశాన్య జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
15 జిల్లాలకు ఎల్లో అలర్ట్, హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్
సాయంత్రం హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం
-
Oct 28, 2025 10:41 IST
విజయవాడలో పలు ప్రాంతాల్లో వర్షం
విజయవాడలో 16.2 సెం.మీ. వరకు వర్షపాతం సూచన
ప్రజలను అప్రమత్తం చేసిన కలెక్టర్, వీఎంసీ కమిషనర్
ఇప్పటికే విజయవాడలో దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసివేత
మెడికల్, కూరగాయలు, పాల షాపులకు మినహాయింపు
అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు: కలెక్టర్
కంట్రోల్ రూమ్: 91549 70454, 0866-2424172
-
Oct 28, 2025 10:40 IST
నెల్లూరు: కృష్ణపట్నం పోర్టులో ఐదో ప్రమాద హెచ్చరిక
నిండుకుండల్లా సోమశిల, కండలేరు, రాళ్లపాడు జలాశయాలు
పెన్నా, సంగం బ్యారేజీలకు భారీగా వరద
-
Oct 28, 2025 10:36 IST
బాపట్ల జిల్లాలో మొంథా తుఫాన్ ఎఫెక్ట్
నిజాంపట్నం హార్బర్‌లో ఐదో ప్రమాద హెచ్చరిక
6 అడుగుల మేర ముందుకువచ్చిన సముద్రం
మచిలీపట్నంలో 500 మీటర్ల ముందుకు వచ్చిన సముద్రం