Share News

Cyclone Montha Safety Guidelines: తుపాను తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

ABN , Publish Date - Oct 29 , 2025 | 11:02 AM

తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు అక్కడకు తరలించి ఆహారం, వసతి సౌకర్యం కల్పించారు.

Cyclone Montha Safety Guidelines: తుపాను తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
Cyclone Montha Safety Guidelines

అమరావతి, అక్టోబర్ 29: రాష్ట్రాన్ని మొంథా తుపాను అతలాకుతలం చేసింది. తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి 12:30 గంటల మధ్య మచిలీపట్నం - కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మొంథా తుపాను తీరాన్ని దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. ప్రస్తుతం తీవ్ర తుపాను.. తుపానుగా బలహీనపడింది. మరికొద్ది గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఉంది. ఇక తుపాను ఎఫ్టెక్‌తో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.


ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు అక్కడకు తరలించి ఆహారం, వసతి సౌకర్యం కల్పించారు. భారీ వర్షాలు అనేక జిల్లాలో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు తుపాను పరిస్థితిపై సమీక్షలు నిర్వహిస్తోంది. ఇక తుపాను తరువాత పలు ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వేడి చేసిన నీటిని తాగాలని సూచించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు స్పష్టం చేశారు.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

  • వేడి చేసిన / క్లోరినేటెడ్ నీరు మాత్రమే త్రాగాలి.

  • అధికారికంగా సమాచారం వచ్చేవరకు బయటకు వెళ్లవద్దు. షెల్టర్ లేదా ఆశ్రయంలో ఉంచినట్లయితే అధికారులు చెప్పే వరకు తిరిగి వెళ్ళవద్దు.

  • విరిగిన విద్యుత్ స్తంభాలు, వదులుగా ఉండే తీగలు, తెగిన తీగలు, ఇతర పదునైన వస్తువుల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి.

  • దెబ్బతిన్న లేదా పడిపోయిన భవనాల్లోకి ప్రవేశించవద్దు.

  • దెబ్బతిన్న విద్యుత్ పరికరాలను లేదా వస్తువులను వాడే ముందు వాటిని ఎలక్ట్రీషియన్ చేత తనిఖీ చేయించాలి.


ఇవి కూడా చదవండి...

యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి.. డిప్యూటీ సీఎం ఆదేశం

శ్రీశైలంలో కుండపోత వర్షం.. విరిగిపడ్డ కొండచరియలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2025 | 11:02 AM