Home » Cyber Crime
ఇమంది రవి కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక వివరాలు సేకరించారు. ప్రహ్లాద్ వెల్లేల పేరిట రవి పాన్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. గతంలో ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని రవి పోలీసులకు చెప్పాడు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కస్టడీ విచారణ పూర్తయింది.
సైబర్ నేరాగాళ్ల వలలో ఇద్దరు పోలీసులు చిక్కారు. ఇద్దరు ఇన్స్‌పెక్టర్ల నుంచి దాదాపు రూ.43 లక్షలను వసూలు చేశారు కేటుగాళ్లు.
కీలక కేసుల పరిష్కారానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌ను ఏపీ సీఐడీ పోలీసులు చేధించారు. కంబోడియా నుంచి సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడిన నిందితుడిని గుర్తించి 1400 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. డైరక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో భారీ క్రైమ్ నెట్‌వర్క్‌ను చేధించారు ఏపీ సీఐడీ అధికారులు.
సైబర్ నేరగాళ్లు కొత్త మార్గంలో మోసాలకు పాల్పడుతున్నారు. తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ పేరుతో లింకులు పంపి అవి ఓపెన్ చేయడం ద్వారా ఖాతాలను కొల్లగొట్టేస్తున్నారు. ఈ వ్యవహారంపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసానికి తెరలేపారు. అమ్మాయితో న్యూడ్ వీడియో కాల్ చేయించి.. ఆ తర్వాత బెదింపులకు పాల్పడుతున్నారు. తాజాగా నగరానికి చెందిన ఓ యువకుడు ఈ తరహ మోసానికి బలైపోయి రూ.3.41 లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.
గుంటూరు జిల్లా కాకుమాను పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పాఠశాల హెడ్ మాస్టర్‌ను బురిడీ కొట్టించారు సైబర్ నేరస్తులు. తాము సీఐడీ అధికారులమని ప్రధానోపాధ్యాయుడికి ఫోన్ చేసిన కేటుగాళ్లు.. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మీ పేరు ఉందంటూ ఆయనపై బెదిరింపులకు దిగారు. డిజిటల్ అరెస్టు చేయబోతున్నట్లు భయబ్రాంతులకు గురి చేశారు. అయోమయంలోకి నెట్టేసి ఆపై డబ్బులు డిమాండ్ చేశారు.
హైదరాబాద్ మహానగరంలో సైబర్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఎవరో ఒకరు, ఎక్కడో ఓ చోట ఈ మోసానికి బలవుతూనే ఉన్నారు. అయితే.. అప్రమత్తతే దీనికి అసలైన మందు అని, జాగ్రత్తలు పాటించాలని పోలీస్ శాఖ సూచిస్తోంది.
సైబర్ నేరగాళ్లు యువకుల మొదలు వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు. అవతలి వ్యక్తి బ్యాంకులో బ్యాలెన్స్ ఉందని తెలిస్తే చాలు.. వారికి వీడియోకాల్ ద్వారా ఫోన్‌చేసి ఆధార్‌కార్డు చూపించి మోసం చేస్తున్నారు.
క్రిస్మస్, న్యూయర్ సెలబ్రేషన్స్, సంక్రాంతి, ఆ వెంటనే ఉగాది.. ఇంకేముంది.. వరుస పండుగలతో జగమంతా ఆనందమయమే అని చెప్పాలి. పండుగల వేళ ఆఫర్లు ఎరగా చూపి మీ జేబులకు చిల్లు పెట్టేందుకు కేటుగాళ్లు. వివరాల్లోకెళితే...