India Post Fake Alert: హెచ్చరిక.. ఇండియా పోస్టు పేరిట మీ ఫోన్‌కు ఈ మెసేజ్ వస్తే అస్సలు రెస్పాండ్ కావొద్దు
ABN , Publish Date - Sep 15 , 2025 | 08:32 AM
పోస్టల్ శాఖ పేరిట సర్క్యులేట్ అవుతున్న ఓ ఫేక్ ఎస్ఎమ్ఎస్ స్కామ్‌పై పీఐబీ ప్రజలను అప్రమత్తం చేసింది. ఇలాంటి మెసేజీలు వస్తే స్పందించొద్దని, మెసేజ్‌ల్లోని లింకులపై క్లిక్ చేయొద్దని హెచ్చరించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఫేక్ ఎస్ఎమ్‌ఎస్ స్కామ్‌లు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రజల్లో ఈ అంశాలపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నా అమాయకులు స్కామర్ల బారిన పడి నష్టపోతున్నారు. తాజాగా ఇలాంటి మరో ఫేక్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్‌పై ప్రెస్ ఇన్ఫర్మేషన్ (పీఐబీ) బ్యూరో భారతీయులను హెచ్చరించింది. ఈ మెసేజ్ తాలూకు స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేసింది. ఇలాంటి మెసేజ్‌లకు అస్సలు రెస్పాండ్ కావొద్దని, మెసేజ్‌లోని లింకులపై క్లిక్ చేయొద్దని మరీ మరీ చెప్పింది (India Post fake SMS).
మెసేజ్‌లో ఏముందంటే..
ఇండియా పోస్టు ప్యాకేజీ డెలివరీ కుదరట్లేదంటూ స్కామర్లు ఈ మెసేజ్ పెట్టారు. ఇండియా పోస్టు ద్వారా వచ్చిన ప్యాకేజీ గోదాములో ఉందని చెప్పుకొచ్చారు. కింద ఇచ్చిన లింకులో అడ్రస్‌ను అప్‌డేట్ చేస్తే ప్యాకేజీ డెలివరీ అవుతుందని, 48 గంటల్లో అడ్రస్ వివరాలను పొందుపరచాలని డెడ్ లైన్ కూడా విధించారు. ఈ మెసేజ్ బాగా సర్క్యులేట్ అవుతుండటంతో పీఐబీ స్పందించింది. ఇండియా పోస్టు ఇలాంటి మెసేజ్‌లను పంపించదని స్పష్టం చేసింది. ఇలాంటి ఎస్ఎమ్ఎస్‌లు, వాటిల్లోని లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది (PIB Fact Check India Post scam).
అధికారిక మెసేజ్‌లా అనిపించే భాష, 24 గంటల్లో పూర్తి చేయాలంటూ డెడ్‌లైన్ విధించడం, ఎస్ఎమ్ఎస్ ద్వారా లింక్ పంపించడం వంటివన్నీ ఇదో స్కామ్ అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పీఐబీ పేర్కొంది. ఈ లింకుపై క్లిక్ చేస్తే స్మార్ట్ ఫోన్‌లోకి మాల్‌వేర్ చొరబడి డివైజ్ హ్యాకర్ల పరిధిలోకి వెళ్లిపోతుందని పేర్కొంది (SMS phishing delivery scam).
ఎస్ఎమ్ఎస్ స్కామ్‌ల బారిన పడకుండా ఉండాలంటే..
ఇలాంటి స్కామ్‌లకు బలికాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన మెసేజ్‌లకు స్పందించకూడదు. అవసరమైతే ప్రభుత్వ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివరాలను తనిఖీ చేసుకోవాలి. కొత్త కొత్త లింక్స్‌పై ఎన్నడూ క్లిక్ చేయకూడదు. వ్యక్తిగత పాస్‌వర్డ్స్, అకౌంట్ వివరాలను ఎస్ఎమ్ఎస్ లేదా ఫోన్ ద్వారా పంచుకోకూడదు. అనుమానాస్పదంగా ఏదైనా అనిపిస్తే వెంటనే సైబర్ సెక్యూరిటీ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలి.
ఇవి కూడా చదవండి
ట్రంప్ సుంకాలతో తీవ్ర ప్రభావం.. ఉద్యోగాలు పోతున్నాయి: శశి థరూర్
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా 400 మందికి పైగా సైంటిస్టులు రేయింబవళ్లు శ్రమించారు: ఇస్రో చీఫ్
For More National News and Telugu News