Retired Employee Duped: రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. రిటైర్డ్ ఉద్యోగినుంచి లక్షల దోపిడీ..
ABN , Publish Date - Sep 06 , 2025 | 02:04 PM
‘నువ్వు దేశ ద్రోహానికి పాల్పడ్డావు. నీపై అరెస్ట్ వారెంట్ వచ్చింది’ అంటూ భయపెట్టాడు. డబ్బులు కడితే కేసు నుంచి బయటపడొచ్చని నమ్మబలికాడు. రాఘవేంద్రరావు అది నిజమేనని నమ్మాడు.
ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో జనాల్ని మోసం చేస్తున్నారు. చదువురాని వారితో పాటు చదువుకున్న వారు కూడా సైబర్ నేరాల బారిన పడుతున్నారు. తాజాగా, ఓ రిటైర్డ్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నాడు. లక్షల రూపాయలు పొగొట్టుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏలూరు, మాదేపల్లికి చెందిన రిటైర్ ఉద్యోగి రాఘవేంద్రరావుకు కొన్ని రోజుల క్రితం సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు.
‘నువ్వు దేశ ద్రోహానికి పాల్పడ్డావు. నీపై అరెస్ట్ వారెంట్ వచ్చింది’ అంటూ భయపెట్టాడు. డబ్బులు కడితే కేసు నుంచి బయటపడొచ్చని నమ్మబలికాడు. రాఘవేంద్రరావు అది నిజమేనని నమ్మాడు. సైబర్ నేరగాడు అడిగిన ప్రతీ సారి డబ్బులు ఇవ్వటం మొదలెట్టాడు. అలా ఏకంగా 42.5 లక్షల రూపాయలు ఇచ్చాడు. తాను సైబర్ నేరానికి గురయ్యానని గుర్తించిన పెద్దాయన పోలీసులు ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఎర్రకోట వద్ద భారీ చోరీ.. కోట్ల విలువైన బంగారు వస్తువులు ఎత్తుకెళ్లిన దొంగ
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు