RTC Bus Collides Granite Lorry: లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:51 PM
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది దాకా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డవారిని వెంటనే రుయా ఆస్పత్రికి తరలించారు.
తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం అగరాల సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ముందు వెళుతున్న గ్రానైట్ లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆర్టీసీకి చెందిన ఓ ఎక్స్‌ప్రెస్ బస్సు బెంగళూరు నుంచి తిరుపతికి వస్తూ ఉంది. బస్సు అగరాల సమీపంలోకి రాగానే డ్రైవర్ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో బస్సు అదుపుతప్పి ముందు వెళ్తున్న గ్రానైట్ లారీని ఢీకొట్టింది. బస్సు వెళుతున్న వేగానికి ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది.
బస్సులోని వారందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. డ్రైవర్ తేరుకుని వెంటనే బ్రేక్ వేశాడు. బస్సు ఆగిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది దాకా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డవారిని వెంటనే రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 48 ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు
వ్యాపారంలో పురోగతి సాధించడానికి గణేశ్ నిమజ్జనంలో ఈ చిన్న పరిహారం చేయండి.!