Home » Crime
కేవలం రూ. 150-200 ఖర్చుతో తయారయ్యే కాల్షియం కార్బైడ్ తుపాకీ( Lethal Calcium carbide gun), పిల్లల జీవితాల్లో అంధకారం సృష్టించింది. కళ్ళకు గాయాలు కావడంతో పిల్లలందరిని ఆసుపత్రులకు తరలించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న పీఈటీ టీచర్ పై భజరంగ్ దళ్, ఏబీవీపీ విద్యార్థి సంఘాల దాడి చేశారు. విద్యార్థినుల పట్ల పీఈటీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ భజరంగ్ దళ్, ఏబీవీపీ నాయకులు దాడికి దిగారు.
భర్తపై మరిగే నీళ్లు, యాసిడ్ పోసింది ఓ భార్య. అసలు, భార్య అంత దారుణంగా ఎందుకు ప్రవర్తించింది? అనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం..
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో పండగపూట విషాదం నెలకొంది. నాగలక్ష్మి అనే మహిళ.. తన ఇద్దరు పిల్లలను చంపేసి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు
పుష్పను తపసీహళ్లి గ్రామానికి చెందిన వేణుతో సుమారు ఏడేళ్ల క్రితం పెళ్లి చేశారు. వివాహానంతరం అదనపు వరకట్నం, స్థలానికి సంబంధించి భర్త కుటుంబం వేధింపులు చేస్తున్నారని మహిళ వీడియో తీస్తూ కన్నీటిపర్యంతమైంది.
ట్రైన్‌లో ఒక మైనర్ బాలికని పెళ్లయి పిల్లలు ఉన్న ఓ కామాంధుడు లైంగికంగా వేధించాడు. బిహార్ రాష్ట్రంలోని ఛప్రా పట్టణంలో 55103 ట్రైన్‌లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎవరూ చూడటం లేదనుకొని.. అసభ్యకరంగా తాకేందుకు యత్నించాడు.
గచ్చిబౌలిలో ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. గచ్చిబౌలి TNGO'S కాలనీలో వికారాబాద్ జిల్లా యాలల ప్రాంతానికి చెందిన బోయిని పరమేశ్వర్ నివాసం ఉంటున్నారు. గచ్చిబౌలి నానక్ రామ్ గూడాలోని ప్రభుత్వ పాఠశాలలో బోయిని పరమేశ్వర్ ఇద్దరు కుమారులు చదువుతున్నారు.
డీజే సౌండ్ దెబ్బకు భారీ గోడ కూలడంతో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం భవానీపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది.
దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో స్వీట్ షాపులపై జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలోని 43 స్వీట్ షాప్స్ లో 3 రోజుల పాటు అధికారులు ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గడువు ముగిసిన పదార్థాలు స్వీట్ల తయారీలో వాడుతున్నట్లు గుర్తించారు. స్వీట్ షాప్ లో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబెల్, ఎక్స్ పైరీ డేట్ లేదని అధికారులు తెలిపారు.
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్)లో దారుణం జరిగింది. ఆస్తి పంపకాలతో తల్లి అంత్యక్రియలు కూతుళ్లు ఆపేశారు. కొంతకాలంగా అక్కా, చెల్లెళ్ల మధ్య భూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే తల్లి చనిపోగా ఏకంగా మూడు రోజులుగా తల్లి అంత్యక్రియలు ఆపేశారు.